ఫ్యాన్స్‌కి హార్ట్ బ్రేక్..!! పెళ్ళికి రెడీ అయిన మరో టాలీవుడ్ హీరోయిన్..

సినీ సెలబ్రెటీలు కూడా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే చాలా మంది పెళ్లి చేసుకొని అభిమానులను కుష్ చేశారు. టాలీవుడ్, బాలీవుడ్ లో పెళ్లిళ్ల హంగామా కనిపిస్తుంది. వరుణ్ తేజ్, లావణ్య అలాగే రకుల్ ప్రీత్ ఇలా కొంతమంది సెలబ్రటీలు పెళ్లి చేసుకున్నారు. అదితి రావు హైదరి, తమన్నా పెళ్ళికి రెడీగా ఉన్నారు.

ఫ్యాన్స్‌కి హార్ట్ బ్రేక్..!! పెళ్ళికి రెడీ అయిన మరో టాలీవుడ్ హీరోయిన్..
Tollywood
Follow us

|

Updated on: Apr 26, 2024 | 1:52 PM

సినిమా ఇండస్ట్రీలో పెళ్లిబాజాలు మోగుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలా మంది పెళ్లి పీటలెక్కుతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అలాగే సినీ సెలబ్రెటీలు కూడా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే చాలా మంది పెళ్లి చేసుకొని అభిమానులను కుష్ చేశారు. టాలీవుడ్, బాలీవుడ్ లో పెళ్లిళ్ల హంగామా కనిపిస్తుంది. వరుణ్ తేజ్, లావణ్య అలాగే రకుల్ ప్రీత్ ఇలా కొంతమంది సెలబ్రటీలు పెళ్లి చేసుకున్నారు. అదితి రావు హైదరి, తమన్నా పెళ్ళికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మరో టాలీవుడ్ హీరోయిన్ కూడా పెళ్లి పీటలెక్కనుందని తెలుస్తోంది. చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఒకే హీరోతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి అలరించింది ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

పై ఫొటోలో ఉన్న క్యూట్ భామ మరెవరో కాదు.. ముద్దుగుమ్మ మేఘా ఆకాష్. నితిన్ హీరోగా నటించిన లై అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. హనురాఘవాపుడు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత మరో సారి నితిన్ తో కలిసి ఛల్ మోహన్ రంగ అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా నిరాశపరిచింది.

ఆతర్వాత తమిళ్ ఇండస్ట్రీకి చెక్కేసింది. అక్కడ రజినీకాంత్ హీరోగా నటించిన పేట సినిమాలో కనిపించింది. అలాగే హిందీ భాషలోనూ నటించింది. శాటిలైట్ శంకర్ అనే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఇదిలా ఉంటే ఈ చిన్నది ఇప్పుడు పెళ్లి పీటలెక్కనుందని తెలుస్తోంది. తాజాగా మేఘా ఆకాష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది.. వెడ్డింగ్ వైబ్స్  అని రాసుకొచ్చింది. దాంతో ఈ చిన్నది పెళ్ళికి రెడీ అయ్యిందని ప్రచారం జరుగుతోంది. తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నాయకుడు కొడుకుని పెళ్లి చేసుకోనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి మేఘా పెళ్లి పై అప్డేట్ ఇస్తుందేమో చూడాలి.

Megha Akash

మేఘా ఆకాష్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Megha Akash (@meghaakash)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.