“టిక్ టాక్” స్టార్స్ ఏమంటున్నారంటే..

చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. టిక్‌టాక్‌తోపాటు 59 చైనా యాప్‌లపై నిషేధాన్ని విధించడంపై మన దేశానికి చెందిన ప్రముఖ టిక్‌టాక్‌ స్టార్‌ ముస్కాన్‌ శర్మ స్వాగతించారు. మన వ్యక్తిగత ప్రయోజనాలకంటే దేశ ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఆమె ఓ వీడియో మెసేజ్ చేశారు. కేంద్రప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. చైనా తన తప్పులకు తగిన మూల్యం చెల్లించుకొని తీరాలని అన్నారు. ముస్కాన్‌ శర్మకు టిక్‌టాక్‌లో 40లక్షల […]

టిక్ టాక్ స్టార్స్ ఏమంటున్నారంటే..
Follow us

|

Updated on: Jul 01, 2020 | 5:51 AM

చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. టిక్‌టాక్‌తోపాటు 59 చైనా యాప్‌లపై నిషేధాన్ని విధించడంపై మన దేశానికి చెందిన ప్రముఖ టిక్‌టాక్‌ స్టార్‌ ముస్కాన్‌ శర్మ స్వాగతించారు. మన వ్యక్తిగత ప్రయోజనాలకంటే దేశ ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఆమె ఓ వీడియో మెసేజ్ చేశారు.

కేంద్రప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. చైనా తన తప్పులకు తగిన మూల్యం చెల్లించుకొని తీరాలని అన్నారు. ముస్కాన్‌ శర్మకు టిక్‌టాక్‌లో 40లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ముస్కాన్ తోపాటు చాలా మంది టిక్ టాక్ స్టార్స్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. వారిలో కొందరు సినిమాకు చెందినవారు కూాడా ఉన్నారు.