
రౌడీ హీరో విజయ్ దేవరకొండే, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్లో వచ్చిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రణబాలి. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదలైనప్పటి నుండి సంచలన వసూళ్లను సాధిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ చిత్రం రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ‘రణబాలి’ తుఫాన్ కొనసాగుతోంది. ప్రీమియర్స్ నుంచే అద్భుతమైన స్పందన రాబట్టిన ఈ చిత్రం, ప్రస్తుతం నార్త్ అమెరికాలో ఏకంగా $600K (సుమారు రూ. 5 కోట్లకు పైగా) గ్రాస్ మార్క్ను అధిగమించి ముందుకు సాగుతోంది. విజయ్ దేవరకొండ సత్తా, రష్మిక క్రేజ్ కలగలసి ఓవర్సీస్ తెలుగు ప్రేక్షకులను థియేటర్లకు భారీగా రప్పిస్తోంది. వీకెండ్లో ప్రదర్శించబడిన అన్ని షోలు హౌస్ఫుల్ కావడం విశేషం.
ఎక్కువ మంది చదివినవి : Nartanasala Movie: బృహన్నలగా ఎన్టీఆర్ విశ్వరూపం.. నర్తనశాల వెనుక ఉన్న ఈ అరుదైన నిజాలు తెలుసా.. ?
గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల తర్వాత విజయ్ – రష్మిక జంటగా వచ్చిన మూడో చిత్రం కావడం ఈ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించింది. అలాగే 19వ శతాబ్దపు పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు ఉండటంతో ప్రేక్షకులు ఈ మూవీ చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో పలికిన డైలాగులు, ఆయన చూపించిన మాస్ అవతారం, రష్మిక ‘జయమ్మ’ పాత్రలో పండించిన భావోద్వేగాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలు జీవితం మారిపోతుంది.. డబ్బు సంపాదనకు మురళీ మోహన్ ఇచ్చిన సలహాలు..
ఈ భారీ ఓవర్సీస్ వసూళ్లతో ‘రణబాలి’ మూవీ లాంగ్ రన్లో మైలురాయి రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమైంది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు , ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ వీకెండ్ ముగిసేసరికి $1 మిలియన్ క్లబ్లో సులువుగా చేరే దిశగా అడుగులు వేస్తోంది. ‘ది రణబాలి వేవ్’ నార్త్ అమెరికాలో మరింత స్పీడందుకుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..