Sudigaali Sudheer: అంగరంగ వైభవంగా జరిగిన సుడిగాలి సుధీర్ పెళ్లి.. అతిధులుగా హేమ, అన్నపూర్ణ హాజరు.. అలరిస్తున్న ప్రోమో..

|

Mar 09, 2022 | 12:22 PM

Sudigaali Sudheer: జబర్దస్త్(jabardasth) ఫేమ్, నటుడు, బుల్లితెర వ్యాఖ్యాత సుడిగాలి సుధీర్.. ఉద్యోగం వదిలి అవకాశాల కోసం అనేక అష్టకష్టాలు పడ్డాడు. తినడానికి తిండి లేక కుళాయి నీళ్ళు తాగే స్టేజ్ నుంచి

Sudigaali Sudheer: అంగరంగ వైభవంగా జరిగిన సుడిగాలి సుధీర్ పెళ్లి.. అతిధులుగా హేమ, అన్నపూర్ణ హాజరు.. అలరిస్తున్న ప్రోమో..
Sudigali Sudheer
Follow us on

Sudigaali Sudheer: జబర్దస్త్(jabardasth) ఫేమ్, నటుడు, బుల్లితెర వ్యాఖ్యాత సుడిగాలి సుధీర్.. ఉద్యోగం వదిలి అవకాశాల కోసం అనేక అష్టకష్టాలు పడ్డాడు. తినడానికి తిండి లేక కుళాయి నీళ్ళు తాగే స్టేజ్ నుంచి ఈరోజు తనకంటూ ఓ ఫేమ్ సంపాదించుకున్నాడు. తాజాగా సుడిగాలి సుధీర్ పెళ్లి అంగరంగ వైభంగా జరిగింది. సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ'(Sridevi Drama Company) షో వేదికగా సుడిగాలి సుధీర్ ఓ ఇంటివాడయ్యాడు. అయితే ఈ పెళ్లి రియల్ పెళ్లి కాదు.. బుల్లి తెరపై స్కిట్ లో భాగంగా జరిగిన పెళ్లి. వివరాల్లోకి వెళ్తే..

“శ్రీదేవి డ్రామా కంపెనీ”షోలో ఈ ఆదివారం (మార్చి 13న) ప్రసారం కానున్న ఎపిసోడ్ లో సుడిగాలి సుధీర్ పెళ్లి జరిగింది. అయితే ఇది షోలోకి స్కిట్ లో భాగంగా జరిగింది.  ప్రముఖ ఎంటర్ ఎంటర్మెంట్ ఛానల్ లో ఈ టీవీ’లో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో  తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేసింది. ఈ ప్రోమో ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది. స్కిట్ లో భాగంగా సుడిగాలి సుధీర్ అందమైన నలుగురు అమ్మాయిలను పెళ్లి చూపులు చూసి.. వారిలో ఒకరైన తేజస్వి నాయుడుని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి చూపుల నేపథ్యంలో ఒకొక్క అమ్మాయి ఒక్కొక్క విధంగా సుధీర్ ను పొగిడి ఆకట్టుకున్నారు. షోలో ఓ రేంజ్ లో సందడి చేశారు. ముఖ్యంగా సుధీర్ నలుగురు అమ్మాయిలతో కలిసి చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను అలరించేలా ఉంది. ఈ పెళ్లికి అతిథులుగా హేమ, అన్నపూర్ణ, బుల్లెట్‌ భాస్కర్‌, రామ్‌ప్రసాద్‌ లు హాజరయ్యారు. తమదైన శైలిలో నవ్వించారు.

సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షో మొదలైనప్పుడు అడుగు పెట్టాడు.. తనదైన స్టైల్ లో స్కిట్స్ చేస్తూ.. బుల్లి తెర ప్రేక్షకులను అలరించాడు. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలతో సుడిగాలి సుధీర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. బాగా పాపులర్ అయ్యాడు. సుధీర్ జబర్దస్త్ కామెడీ షోల్లో చేస్తూనే.. ఢీ డాన్స్ షోలో ఒక మెంటర్ గాను, శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్ గాను బుల్లి తెరపై పలు అవకాశాలను అందుకున్నాడు. అనంతరం సినిమాల్లో కూడా పలు అవకాశాలు అందుకున్నాడు. అయితే సుడిగాలి సుధీర్ నటనతో ఎంత పాపులర్ అయ్యాడో.. అంతకంటే ఎక్కువగా యాంకర్ రష్మీ తో ఎఫైర్ అంటూ వచ్చే వార్తలతో మరింత పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

 

Also Read:

 బాధ కలిగినపుడు కన్నీరు కాటుక కళ్లను దాటనివ్వండి! సైన్స్‌ ఏం చెబుతోందంటే..