Nitin Check Movie: వెండి తెరపై నితిన్ ప్లాప్ సినిమాకు బుల్లి తెరపై షాకింగ్ టీఆర్‌పీ రేటింగ్..

Nitin Check Movie: సినీ ప్రేమికుల ఇష్టాలను తెలుసుకోవడం కష్టం.. ఎందుకంటే సినిమా థియేటర్స్ లో ప్లాప్ గా నిలిచినవి బుల్లి తెరపై టాప్ రేటింగ్ ను సొంతం చేసుకుంటున్నాయి..

Nitin Check Movie: వెండి తెరపై నితిన్ ప్లాప్ సినిమాకు బుల్లి తెరపై షాకింగ్ టీఆర్‌పీ రేటింగ్..
Nitin Check

Updated on: Jul 23, 2021 | 5:09 PM

Nitin Check Movie: సినీ ప్రేమికుల ఇష్టాలను తెలుసుకోవడం కష్టం.. ఎందుకంటే సినిమా థియేటర్స్ లో ప్లాప్ గా నిలిచినవి బుల్లి తెరపై టాప్ రేటింగ్ ను సొంతం చేసుకుంది మంచి విజయాన్ని సాధిస్తాయి, ఇప్పటికే అతడు ఖలేజా, సర్దార్ గబ్బర్ సింగ్, ఒక్క మగాడు వంటి అనేక ప్లాప్ సినిమాలు టీవీల్లో ప్రసరమై సూపర్ హిట్ అయ్యాయి. ఆలాంటి సినిమాల సరసన నితిన్ చెక్ మూవీకూడా చేరింది.

కరోనా లాక్ డౌన్ తర్వాత రిలీజైన నితిన్ సినిమాల్లో చెక్ ఒకటి.. ఈ సినిమాకు చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వం వహించాడు. ఈ చెక్ సినిమా ఫిబ్రవరి 26న థియేటర్స్ లో సందడి చేసింది. నితిన్ సరసన తొలిసారిగా ప్రియా వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ లు నటించారు. నిజానికి చంద్రశేఖర్ ఏలేటి సినిమా అంటే హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది.. అయితే ఈ చెక్ సినిమాలో ఎటువంటి టాక్ వినిపించలేదు.. అంత సాదాసీదాగా చెక్ మూవీ సాగిపోయింది. కేవలం రూ. 7 కోట్లు మాత్రమే వసూలు చేసి ప్లాప్ మూవీగా నిలిచింది.

ఈ సినిమా గత వారం స్మాల్ స్క్రీన్ పై ప్రసారం అయ్యింది. అయితే చెక్ మూవీ 8. 9 టీఆర్‌పీ రేటింగ్ ను సొంతం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. నితిన్ రంగ్ దే మూవీ చెక్ కంటే మంచి రివ్యూని సొంతం చేసుకుంది.. కానీ ఆ సినిమాకు 7. రేటింగ్ రాగా.. చెక్ మూవీకి అంతకంటే ఎక్కువ రేటింగ్ వచ్చింది.

Also Read: Raj Kundra: ఆ డబ్బుతో రాజ్ కుంద్రా ఏం చేసేవాడో తెలుసా? పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు

Follow Us