Ravi Krishna Navya Swamy: ప్రేమగా.. ప్రేమతో..ప్రేమ సాక్షిగా.. రవికృష్ణ, నవ్యస్వామి రిలేషన్‌షిప్‌లో ఉన్నారా..?

|

Feb 21, 2021 | 2:12 PM

ఫిల్మ్‌ స్టార్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వార్తలు రెగ్యులర్‌గా వినిపిస్తుంటాయి. కానీ బుల్లితెర తారలు రిలేషన్‌షిప్‌లో ఉన్నారన్న న్యూస్ కూడా ఈ మధ్య బాగా వినిపిస్తున్నాయి.

Ravi Krishna Navya Swamy:  ప్రేమగా.. ప్రేమతో..ప్రేమ సాక్షిగా.. రవికృష్ణ, నవ్యస్వామి రిలేషన్‌షిప్‌లో ఉన్నారా..?
Follow us on

Ravi Krishna Navya Swamy: ఫిల్మ్‌ స్టార్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వార్తలు రెగ్యులర్‌గా వినిపిస్తుంటాయి. కానీ బుల్లితెర తారలు రిలేషన్‌షిప్‌లో ఉన్నారన్న న్యూస్ కూడా ఈ మధ్య బాగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొంత మంది స్మాల్ స్క్రీన్‌ పెయిర్‌ రియల్‌ లైఫ్‌ జోడిలుగా మారటంతో ఇప్పుడు మరో జంటకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియా తెగ హల్‌చల్ చేస్తోంది.

సూపర్‌ హిట్ సీరియల్‌ ‘ఆమెకథ’తో ఫేమస్‌ అయిన జోడీ రవికృష్ణ, నవ్యస్వామి. స్క్రీన్ మీద ఈ జంటను చూసిన ఫ్యాన్స్ రియల్‌ లైఫ్‌లోనూ వాళ్లు జంట అయితే బావుంటుందని ఆశపడ్డారు. అదే విషయాన్ని సోషల్ మీడియాలోనూ ట్రెండ్‌ చేశారు. అయితే ప్రేమ పెళ్లి విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా.. ఆన్‌ స్క్రీన్‌, ఆఫ్ స్క్రీన్ మంచి కెమిస్ట్రీనే మెయిన్‌టైన్ చేస్తున్నారు రవీ – నవ్య.

తాజాగా ఓ షో కోసం రవికృష్ణ, నవ్య చేసిన ఓ సాంగ్ ప్రోమో ఈ న్యూస్‌కు మంచి వెయిట్ తీసుకొచ్చింది. శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్ట్స్ ఎపిసోడ్‌ ప్రోమోలో రవీ – నవ్య పెళ్లి సీన్‌ చూపించారు. అంతేకాదు అందులోనే… ఈ జంట ఓ రొమాంటిక్ సాంగ్‌కు డ్యాన్స్‌ కూడా చేశారు. ఈ ప్రోమోలో ఇద్దరి కెమిస్ట్రీ చూస్తే… ‘నిజమే వీళ్లు ప్రేమలో ఉన్నారేమో అని అనిపిస్తుందంటున్నారు’ బుల్లితెర ఆడియన్స్‌.

Also Read:

‘చావు కబురు చల్లగా’ నుంచి సెకండ్ సాంగ్.. అందమైన మెలోడీతో రాబోతున్న బస్తీ బాలరాజు..

‘ఏ.1 ఎక్స్‌ప్రెస్’తో రానున్న సందీప్ కిషన్.. కారణాల వల్ల వాయిదా పడిన సినిమా.. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే..