Brahmamudi, January 4th Episode: అసహనంలో సుభాష్.. రాజ్, కావ్యలను దెబ్బకొట్టేందుకు అనామిక ప్లాన్..

|

Jan 04, 2025 | 12:31 PM

కావ్య ప్రవర్తనతో సుభాష్, ఇందిరా దేవి, అపర్ణలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కావ్య ప్రవర్తన వల్ల ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడుతున్నారన్న విషయం కావ్యకి చెప్పాలని నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు హడావిడిగా ఆఫీస్ పనులు కూర్తి చేస్తూ ఉంటారు రాజ్, కావ్యలు. వీళ్లను దెబ్బ కొట్టేందుకు అనామిక మాస్టర్ ప్లాన్స్ వేస్తుంది..

Brahmamudi, January 4th Episode: అసహనంలో సుభాష్.. రాజ్, కావ్యలను దెబ్బకొట్టేందుకు అనామిక ప్లాన్..
Brahmamudi
Image Credit source: Disney Hotstar
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్, కావ్యలు ఇంటికి వస్తారు. కావ్య, రాజ్‌లు ఇంటికి రాగానే రుద్రాణి మొదలు పెడుతుంది. రాత్రంతా కారులో షికారు అలిసి పోయి వచ్చినట్టు ఉన్నారని అంటుంది రుద్రాణి. కారులోనే వెళ్లాం కానీ షికారుకు కాదు.. అయినా వెళ్లింది భార్యభర్తలమే కదా ఎందుకు అంత వెటకారంగా మాట్లాడుతున్నారు అని కావ్య అంటుంది. మీరు ఎక్కడికి అయినా ఊరేగండి. మాకు అనవసరం.. మీరు ఊరేగడానికి ఏసీ కారు కావాలి. కానీ ఇంట్లో వాళ్లు బయటకు వెళ్లడానికి ఒక్క కారు కూడా అవసరం లేదా? అని ధాన్యలక్ష్మి అంటే.. అదేంటి ఇంటి దగ్గర ఓ కారు ఉంచే వెళ్లాం కదా అని కావ్య అంటే.. మిగతా నాలుగు కార్లు తిప్పి పంపించేశావు కదా.. అని రుద్రాణి అంటే.. ఎవరిని అడగాలి? అని కావ్య అడిగే సరికి అందరూ షాక్ అవుతారు. నేను ఎవరి పర్మిషన్ తీసుకోవాలో నాకు అర్థం కావడం లేదు. నా భర్త నా పక్కనే ఉన్నాడు. ఆయనకు తెలిసే కదా కార్లు పంపించాను అని కావ్య అంటుంది.

నేను పర్మిషన్ ఎవరిని అడగాలి..

అసలు నీకు ఎంత పొగరు? నీకు కార్లు వద్దని చెప్పే హక్కు ఎవరు ఇచ్చారని ధాన్యలక్ష్మి అడిగితే.. అన్ని విషయాల్లో నాకు సర్వ హక్కులు తాతయ్య గారు ఇచ్చారని కావ్య అంటే.. విన్నావా అక్కా ఆ సమాధానం అని ధాన్యలక్ష్మి అంటే.. మీరు లక్షలకు లక్షలు తీసుకుని ఖర్చు పెడుతూ ఉంటే ఎందుకు ఇవ్వాలి? దేనికి అయినా ఒక పద్దతి ఉంటుంది. కోట్లు ఉన్నంత మాత్రాన లెక్క లేకుండా ఖర్చు పెడితే ఏదో ఒక రోజు ఆ కోట్లు లక్షలుగా మారిపోతాయి. అప్పుడు మీరు ఎవర్ని నిందిస్తారు? నన్నే కదా.. అందుకే ముందు నుంచి జాగ్రత్త పడుతున్నా. విచ్చలవిడిగా ఖర్చు పెడతాను అంటే ఇవ్వడానికి నేను సిద్ధంగా లేనని కావ్య అంటే.. నువ్వు పెట్టే రూల్స్ వల్ల ఇంట్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు. దానికి ఏం చెప్తావని రుద్రాణి అడిగితే.. ఇంత సేపూ నేను చెప్పిందే జవాబు అని కావ్య చెప్పి వెళ్తుంది. కావ్య మాటలకు ఇంట్లోని వాళ్లందరూ షాక్‌కి గురవుతారు. కావ్య మాట్లాడిన పద్దతి నాకు నచ్చలేదని ప్రకాశం వెళ్లిపోతాడు. ఇక ఇద్దరూ గదిలోకి వెళ్తారు. ఏమైపోతున్నాయి ఈ బంధాలు, బంధుత్వాలు? అందర్నీ ఒకటిగా ఉంచాలి అన్న తాతయ్య గారి ప్రయత్నం వృథాగా పోతుందేమోనని రాజ్ అంటాడు.

నా ప్రవర్త బాధ ఉన్నా ఇదే కరెక్ట్..

నా ప్రవర్తన మీకు బాధగా అనిపిస్తుందా? అని కావ్య అడిగితే.. నువ్వు అంత కఠినంగా మాట్లాడకుండా ఉండాల్సిందని రాజ్ అంటే.. ఈ ఇంటికి జబ్బు చేసింది అండి. ఇదే వైద్యం. అటూ ఇటూ నడిచే వాళ్లందర్నీ ఒకే ప్రయత్నం మీద నడిచేసేలా చేసే ప్రయత్నం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ నచ్చేలా ఉండాలంటే వీలు కాదు. తాతయ్య గారి బిల్ కట్టడానికి మీరు కట్టడానికి మీరు పడ్డ పాట్లు నేను చూశాను. వీళ్లందరికీ డబ్బు విలువ తెలుస్తుందని కావ్య అంటే.. కానీ నువ్వు ఈ కుటుంబానికి దూరం అయ్యే అవకాశం ఉందని రాజ్ అంటే.. మీకు నిజం తెలుసు కదా.. అది చాలు నాకు అని కావ్య అంటుంది. సరే మీరు ఫ్రెష్ అవ్వండి. నేను కాఫీ తెస్తానని కావ్య అంటుంది.

ఇవి కూడా చదవండి

కావ్య రూల్స్‌కి ప్రకాశం కూడా బాధ పడుతున్నాడు..

మరోవైపు సుభాష్, ఇందిరా దేవి, అపర్ణలు మాట్లాడుకుంటూ ఉంటారు. కావ్య బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తుందని మనం ఆనంద పడాలో.. లేక రుద్రాణి, ధాన్యలక్ష్మిల పట్ల కఠినంగా ఉంటుందనో బాధ పడాలో అర్థం కావడం లేదని ఇందిరా దేవి అంటే.. సక్రమంగానే నిర్వర్తిస్తుంది. కానీ తను తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చేలా ఉండాలి. అలా కాకుండా తను చెప్పిందే అందరూ వినాలి.. తను పెట్టిందే అందరూ తినాలి అంటే.. ఇబ్బందిగా ఉంటుందని ఇందిరా దేవి అంటే.. కావ్య చేస్తున్న ఈ పనుల వల్ల రుద్రాణి, ధాన్యలక్ష్మిలకు గొడవ చేయడానికి మరింత ఆస్కారం దొరికిందని పెద్దావిడ అంటే.. ఆ ప్రభావం ఇప్పుడు ప్రకాశం మీద కూడా పడింది. తనకు కూడా కావ్య పద్దతి నచ్చడం లేదు. నాతో చెప్పలేక చెబుతున్నాడని సుభాష్ అంటాడు. లేదండీ ప్రకాశం వాళ్ల లాగా మూర్ఖంగా ఆలోచిస్తాడని నేను అనుకోవడం లేదు. ప్రకాశం ఎప్పటికీ ఆ తప్పు చేయడని అపర్ణ అంటే.. అదే పొరపాటు. సుభాష్ చెప్పిన దానిలో తప్పు లేకపోలేదని ఇందిరా దేవి అంటుంది.

కావ్యలో మార్పు రావాలి..

ఇంట్లో అందరి ప్రవర్తనలో మార్పు వచ్చే లోపు.. కావ్య ప్రవర్తనలో మార్పు రావాలని సుభాష్ అంటే.. ఒక పని చేయండి. నువ్వు రాజ్‌తో మాట్లాడి చూడు.. నువ్వు కావ్యతో మాట్లాడి చూడు.. ఏదో ఒకటి చేసి ఇంట్లో పరిస్థితులు చక్కదిద్దండి. నేను కోరేది అదొక్కటేని ఇందిరా దేవి అంటే.. సరే అంటారు. ఆ తర్వాత నంద గోపాల్‌కి ఒక్కటి ఇస్తుంది అనామిక. ఆరు నెలల నుంచి నేను ఎంత పగ్భందీగా ప్లాన్ చేస్తే.. పెంట పెంట చేశావు. మూడు నెలలు అజ్ఞాతంలో ఉండమంటే నీకు గర్ల ఫ్రెండ్ కావాల్సి వచ్చిందా? నిన్ను అసలు చంపేయాలని ఉందని అనామిక తిడుతుంది. వీడిని నమ్మి మనం ఎంత పని చేశాం. లేదంటే నా జాగ్రత్తలో నేను ఉండేదాన్ని కదా.. చూడు నేను చెప్పినట్టు చేస్తే సరి. లేదంటే నేనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తానని అనామిక బెదిరిస్తుంది. ఇక సామంత్ కూడా నంద గోపాల్‌ని బెదిరిస్తాడు. ఈ దెబ్బతో ఆ రాజ్ ఇంకా జాగ్రత్త పడతాడు. ఎలాగైనా కంపెనీని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడని రాజ్ అంటే.. ఆ కావ్య వేసే డిజైన్స్ నాకు కావాలి. ఆ కంపెనీని పాతాలంలో దించేందుకు ఎత్తుకు పై ఎత్తు వేస్తూనే ఉంటా. ఈ సారి నేను కొట్టబోయే దెబ్బకు ఈ కంపెనీ పరువు ప్రతిష్టలు పేక మేడల్లా కూలిపోతాయని అనామిక అంటుంది.

అనామిక కుట్ర..

ఆ తర్వాత డిజైన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రాత్రంతా డిజైన్స్ గురించి కష్ట పడుతూ ఉంటారు. ఇక తెల్లవారుతుంది కావ్య హడావిడిగా ఉదయం ఆఫీస్‌కి వెళ్తుంది. అపర్ణ పిలిచి మాట్లాడదాం అంటే.. నాకు అర్జెంట్‌గా పని ఉంది వెళ్లాలి అని వెళ్లిపోతుంది. ఆ తర్వాత రాజ్‌తో సుభాష్ కూడా మాట్లాడదాం అనుకుంటే.. రాజ్ కూడా హడావిడిగా వెళ్తారు. ఆఫీస్‌కి వెళ్లి బంగారు నగలను అన్నీ చెక్ చేస్తారు రాజ్, కావ్యలు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌లో రాజ్, కావ్యలను దెబ్బకొట్టేందుకు అనామిక మరో ప్లాన్ చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..