Brahmamudi, January 16th Episode: రుద్రాణికి తెలిసిపోయి నిజం.. అడ్డంగా బుక్కైపోయిన కావ్య, రాజ్‌లు!

|

Jan 16, 2025 | 1:24 PM

కావ్యని పిలిచి సపరేటుగా పిలుస్తాడు రాజ్. ఏదో గిఫ్ట్ ఇస్తాడని అనుకుంటుంది కావ్య. ఇంతలో స్వప్న కొనుక్కున్న నగలు ఇచ్చి ఇమ్మని అంటాడు. అవి తీసుకెళ్లి స్వప్నకు ఇస్తుంది కావ్య. అదంతా చూసి రుద్రాణి కావాలనే గొడవ చేస్తుంది. అందుకు ధాన్యలక్ష్మి కూడా తోడవుతుంది. అప్పుడే రాజ్ వచ్చి సర్ది చెప్పాలనుకుంటాడు..

Brahmamudi, January 16th Episode: రుద్రాణికి తెలిసిపోయి నిజం.. అడ్డంగా బుక్కైపోయిన కావ్య, రాజ్‌లు!
Brahmamudi
Follow us on

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్యకు గోల్డ్ బాక్స్ ఇస్తాడు రాజ్. అసలే ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఇంత ఖరీదైన గిఫ్ట్ అవసరమా.. ప్రేమగా ఓ బిస్కెటో.. చాక్లెటో ఇచ్చినా చాలు అని కావ్య అంటే.. చాలా ఊహించుకుంటున్నావు కానీ.. ముందు అది ఓపెన్ చేసి చూడు. ఏం గిఫ్ట్ ఇచ్చానో అర్థమవుతుందని అంటాడు రాజ్. ఇవి మా స్వప్న అక్క కొనుక్కున్న నగలు కదా.. అవును ఈ నగలు కొనుక్కున్నందుకు ఆ రోజు నువ్వు తిట్టావు కదా.. ఇప్పుడు నువ్వు ప్రెజెంట్ చేస్తే చాలా సంతోష పడుతుందని రాజ్ అంటే.. అవును ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ల అందరి కోసం బాగానే ఆలోచిస్తారు. ఒక్క నా మనసు తప్పా అని కావ్య అంటుంది. ఇప్పుడేమైంది.. నీతో బాగానే ఉన్నాను కదా అని రాజ్ అంటే.. ఉంటున్నారులే అవసరం ఉండి ఉండనట్టు అని కావ్య అంటుంది. మరోవైపు కుర్చీలో కూర్చోవడానికి ఆలోచిస్తారు రుద్రాణి, ధాన్యలక్ష్మిలు. అక్కడ క్లాత్ వేసిన కుర్చీలో రుద్రాణి కూర్చోబోతుండగా అక్కడున్న అతను ఆపుతాడు. ఏమైంది.. ఈ కుర్చీ కింద బాంబ్ పెట్టారా అని రుద్రాణి అంటే.. లేదు కానీ ఈ కుర్చీలో కూర్చోవడానికి వీల్లేదని అంటాడు.

పడిపోయిన రుద్రాణి..

నువ్వు ఎవడిరా నన్ను కూర్చోవద్దని చెప్పడానికి అని రుద్రాణి అంటే.. నా పేరు సీమంతం సీను అని అంటాడు. నీకంత సీను లేదని నోరు మూసుకుని పక్కకు వెళ్లమని ధాన్యలక్ష్మి అంటే.. మీరు వద్దని అంటున్నారు కాబట్టి.. ఇందులోనే కూర్చుంటానని రుద్రాణి అని.. పట్టుబట్టి మరీ కూర్చుంటుంది. దీంతో ఒక్కసారిగా కింద పడుతుంది. నడుము విరిగింది అంటూ రుద్రాణి అంటే.. వద్దని ఎంత చెప్పినా వినిపించుకోకుండా కూర్చున్నారని కనకం అంటే.. ఏయ్ కనకం అంటూ రుద్రాణి తిడుతుంది. చూడు ధాన్యలక్ష్మి గారు.. నేను వద్దని ఎంత చెప్పినా వినిపించుకోకుండా కూర్చున్నారు. మళ్లీ నా మీద అబంఢాలు వేస్తున్నారు ఏంటి అని అంటుంది కనకం. ఇక సీమంతం సీనుకు ఒక్కటి పీకుతుంది రుద్రాణి.

స్వప్నకు గిఫ్ట్ ఇచ్చిన కావ్య..

ఇక స్వప్నని అపర్ణ రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కావ్య వచ్చి.. నగలు ఇస్తుంది. దీంత స్వప్న సంతోష పడుతుంది. నగలు స్వప్నకు అలంకరిస్తుంది. అప్పుడే అదంతా రుద్రాణి, ధాన్యలక్ష్మిలు చూస్తారు. కావాలానే రుద్రాణి రచ్చ చేస్తుంది. ధాన్యలక్ష్మీ చూడు.. అంటూ చప్పట్లు కొడుతూ శభాష్ కావ్య అని వస్తుంది రుద్రాణి. మీరిద్దరూ ఎంత తోడు దొంగలో అర్థమైంది. అవునులే కనకం కూతుళ్లు కదా.. అక్కడికి ప్రకాశం, సుభాష్‌లు కూడా వస్తారు. ఏమైంది ఇప్పుడు నువ్వు అంత వెటకారంగా మాట్లాడతావేంటి? అని అపర్ణ అంటే.. కళ్ల ముందు అంతా కనిపిస్తుంది కదా వదినా.. ఖర్చులు పెరిగిపోతున్నాయని.. మా అందరికీ ఆంక్షలు పెట్టి.. అక్కకి మాత్రం చెక్ ఇచ్చి.. నగలు కొనుక్కోమని చెప్పింది. ఇప్పుడు టైమ్ తీసుకుని దుగ్గిరాల కానుక అంటూ అక్క మెడలో వేసింది. దీనిని ఏమంటారు అని రుద్రాణి అంటే.. చావు తెలివితేటలు అంటారు. మేమందరం వృథా ఖర్చులు పెడుతున్నామని గోల చేసింది కదా అని ధాన్యలక్ష్మి అంటుంది.

ఇవి కూడా చదవండి

కడుపు నిండా భోజనం కూడా తిననివ్వడం లేదు..

ఇప్పుడు దీని గురించి ఇంత రభస అవసరమా.. జరిగేది నీ కోడలి సీమంతమే కదా.. నువ్వు అడ్డు పడతావేంటి? కొంచమన్నా బుద్ధి ఉండాలని సుభాష్ అంటాడు. ఉంటే అది రుద్రాణి ఎందుకు అవుతుంది? అని ఇందిరా దేవి అంటుంది. పది లక్షలు గోల్డ్ నక్లెస్ తెచ్చి అక్కకు ఇవ్వొచ్చు కానీ.. మేము కడుపు నిండా భోజనం కూడా తినకూడదా అని ధాన్యలక్ష్మి అంటే.. ఏంటి? ఇద్దరూ రెచ్చిపోయి మా ఇద్దరినీ బ్లేమ్ చేస్తున్నారు? మేమిద్దరం కలిసి పోయామా.. ఆ రోజు నా చెల్లెలు చెక్ ఇచ్చి ఇంట్లో ఏదన్నా అవసరం ఉంటే వాడమని చెప్పింది. ఎవరూ అడగలేదు.. అందుకే నేను ఈ బంగారం కొనుక్కున్నా. అందుకు కావ్య నన్ను తిట్టింది కదా.. నేను అలిగి విసిరి కొట్టి వెళ్లిపోయాను. ఇదే జరిగింది.. నమ్మితే నమ్మండి లేదంటే లేదని స్వప్న అంటుంది. నోరు మూయండి.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాక నువ్వు వాయిస్ పెంచుతున్నావేంటి? అని రుద్రాణి, ధాన్యలక్ష్మిలు అంటారు.

రుద్రాణికి తెలిసిపోయిన నిజం..

అనుకున్నాను.. ఇలాంటిది ఏదో జరుగుతుందని అనుకున్నా.. ఎప్పుడు మా అత్త గారి ఇంటికి వచ్చినా ఏదో ఒక గొడవ లేవదీసి అందరికీ మన శ్శాంతి లేకుండా చేస్తారు. ఇప్పుడు చేయకుంటే ఎలా? అని రాజ్ అంటాడు. సరే రేపు నాకు డైమెండ్ నక్లెస్ కావాలని రుద్రాణి అంటే.. నువ్వేమన్నా కడుపుతో ఉన్నావా.. మరి ఏంటి? నేను కడుపుతో ఉన్నా.. నీకు వారసుడిని ఇవ్వబోతుంటే.. ఈవిడని తెచ్చుకుని గొడవ చేస్తావేంటి? అని స్వప్న అంటుంది. ఆ రోజు కళావతి సీరియస్ అయిందని.. నాకే ఏదోలా అనిపించింది. అందుకే నేను నా భార్యని మందలించాను. అంత కఠినంగా మాట్లాడటం అవసరమా? అని కోపడ్డాను. స్వప్నకు ఇవ్వాల్సింది జాగ్రత్త చేసి.. ఈ సమయంలో ఇస్తే మంచిదని ఇచ్చాను. కళావతి మన కోసమే ఇంకా ఎక్కువగా కష్ట పడుతుందని రాజ్ అంటాడు. మరోవైపు రాహుల్ కంపెనీకి వెళ్లి అన్నీ కనుక్కుంటాడు. అలాగే కావ్య నగలు తాకట్టు పెట్టి ఆస్పత్రి బిల్ కట్టిందని అంటాడు. అయితే ఏదో జరుగుతుంది రా.. అదేంటో కనిపెట్టాలి.. ఎలాగైనా పెంట పెట్టాలని రుద్రాణి ఫిక్స్ అవుతుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..