Samatha J |
Jan 15, 2025 | 8:40 PM
పవన్ కల్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడిక్ మూవీ హరి హర వీరమల్లు. టైటిల్ ఎనౌన్స్‌మెంట్ నుంచే అభిమానుల్లో అంచనాలు పెంచేసిన ఈ సినిమా, ఎంత బజ్ క్రియేట్ చేసిందో అంతే ఆలస్యమవుతోంది. దీంతో ఫ్యాన్స్ కూడా వీరమల్లు విషయంలో ఫీల్ అవుతున్నారు.
ఆల్రెడీ రిలీజ్ డేట్ లాక్ చేసిన యూనిట్ ఈ సంక్రాంతికి బిగ్ అప్‌డేట్ ఉంటుందని ఎప్పటి నుంచో ఊరిస్తోంది. సంక్రాంతికి పవన్ పాడిన పాట వస్తుందన్న ప్రచారం జరిగింది.
తరువాత సాంగ్ టీజర్ మాత్రమే అంటూ ఫ్యాన్స్ ఆశల మీద నీళ్లు చల్లేసింది యూనిట్. ఫైనల్‌గా ఆ టీజర్‌లో ఒక్క కొత్త షాట్ కూడా చూపించకుండా పాత పోస్టర్ స్టిల్‌తోనే సరిపెట్టేసింది.
ప్రజెంట్ ఫైనల్ స్టేజ్ షూటింగ్ జరుపుకుంటున్న హరి హర వీరమల్లు మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్‌కు పెద్దగా టైమ్ లేకపోవటంతో ఇప్పటికైనా టీజర్, ప్రోమో అంటూ టైమ్ పాస్ చేయకుండా ప్రమోషన్ స్పీడు పెంచాలని కోరుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్.