Brahmamudi, April 7th episode: రాజ్‌కు కళావతి మాస్ క్లాస్.. రాజ్‌కు ఒకే ఒక్క చివరి అవకాశం..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాహుల్, రుద్రాణిలు కలిపి ఓ డ్రామా స్టార్ట్ చేస్తారు. అనామిక రావడాన్ని గమనించిన రాహుల్.. కావాలనే తన తల్లిని తిడతాడు. ఏ తల్లి అయినా కొడుకును కింగ్‌లా చూడాలని అనుకుంటుంది. కానీ నీలా బానిసలా బతకమని చెప్పదు. అరే ఎండీ పోస్ట్ పోతేపోయింది. మన కళ్యాణే కదా అనుకున్నా. ఆఖరికి నేను అడిగే ఒక చిన్న కోరిక కూడా తీర్చలేవా? అని రాహుల్ అడిగితే.. నేను చెప్తే ఎవరు వింటారు రాహుల్ అని రుద్రాణి నిటిస్తుంది. అలా చెప్పి తప్పించుకోకు..

Brahmamudi, April 7th episode: రాజ్‌కు కళావతి మాస్ క్లాస్.. రాజ్‌కు ఒకే ఒక్క చివరి అవకాశం..
Brahmamudi
Follow us

|

Updated on: Apr 08, 2024 | 12:41 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాహుల్, రుద్రాణిలు కలిపి ఓ డ్రామా స్టార్ట్ చేస్తారు. అనామిక రావడాన్ని గమనించిన రాహుల్.. కావాలనే తన తల్లిని తిడతాడు. ఏ తల్లి అయినా కొడుకును కింగ్‌లా చూడాలని అనుకుంటుంది. కానీ నీలా బానిసలా బతకమని చెప్పదు. అరే ఎండీ పోస్ట్ పోతేపోయింది. మన కళ్యాణే కదా అనుకున్నా. ఆఖరికి నేను అడిగే ఒక చిన్న కోరిక కూడా తీర్చలేవా? అని రాహుల్ అడిగితే.. నేను చెప్తే ఎవరు వింటారు రాహుల్ అని రుద్రాణి నిటిస్తుంది. అలా చెప్పి తప్పించుకోకు మమ్మీ. అసలు నీ కడుపున ఎందుకు పుట్టానా అని అనిపిస్తుందని రాహుల్ అంటే.. అనామిక వెళ్లి ఏంటి రాహుల్ తల్లితో ఇలాగేనా మాట్లాడేది అని అంటుంది. నా బాధ నీకు అర్థం కాదు.. గట్టుమీద నుండి ఎన్నైనా చెప్పొచ్చు అని కోపంగా వెళ్లిపోతాడు రాహుల్.

రుద్రాణి దొంగ ఏడుపు.. పాపం కరిగిపోయిన తింగరి బుచ్చి..

ఏమైంది ఆంటీ.. రాహుల్ ఎందుకు అంత కోపంగా ఉన్నాడు? ఏమైందని రుద్రాణిని అనామిక అడుగుతుంది. కళ్యాణ్ ఎండీగా అయ్యాడు కదా.. నన్ను జనరల్ మేనేజర్‌ని చేయ్యి. నన్ను నేను ఫ్రూవ్ చేసుకునే అవకాశం కావాలి అని అంటున్నాడు. నేను చెప్తే నా మాట ఎవరు వింటారు చెప్పు? వాడిని ఎవరూ నమ్మడం లేదు. రాహుల్‌ని ఈ ఇంట్లో సపోర్ట్ చేసే మనిషి ఎవరున్నారు చెప్పు? ఈ విషయం వాడికి అర్థం కావడం లేదని రుద్రాణి దొంగ నాటకాలు ఆడుతుంది. ఇది విన్న అనామిక.. బాధ పడకండి ఆంటీ నేను కళ్యాణ్‌తో మాట్లాడి.. రాహుల్‌ని జనరల్ మేనేజర్‌గా పెట్టుకోమని చెప్తాను. ఎలాగైనా కళ్యాణ్‌ని నేను ఒప్పిస్తాను అని రుద్రాణితో అంటుంది అనామిక.

రుద్రాణి, రాహుల్ ప్లాన్ సక్సెస్..

అనామిక వెళ్లిపోయాక.. రాహుల్, రుద్రాణిలు కలిసి నవ్వుకుంటారు. మనం అనుకున్నట్టే కళ్యాణ్‌ని ఒప్పిస్తాను అంటుంది. నీకు వెళ్లే దారి తెప్పించాను. కానీ ఈసారి మాత్రం మిస్ చేయకు. పైగా ఇప్పుడు ఇక్కడ రాజ్ కూడా అక్కడ లేడు కాబట్టి.. ఆ కళ్యాణ్‌ని చేతకాని వాడిని చేసి నువ్వే ఎండీ అవ్వాలి అని రుద్రాణి చెబుతుంది.

ఇవి కూడా చదవండి

పాపం రాజ్‌.. మాస్ క్లాస్ ఇచ్చిన కళావతి..

ఈ సీన్ కట్ చేస్తే.. బాబు గుక్క పెట్టి ఏడుస్తాడు. దీంతో రాజ్ బాబును ఊరుకోబెడుతూ ఉంటాడు. అయినా ఊరుకోకపోతే.. పాలు వచ్చేస్తున్నాయిరా. అమ్మ వచ్చేస్తుంది.. ఎత్తుకుంటుంది.. పాలు ఇస్తుంది.. ఏడవకు అమ్మ వచ్చేస్తుందని రాజ్ అంటాడు. అప్పుడే వచ్చి అదంతా విన్న కళావతి బాగా సీరియస్ వస్తుంది. హలో మాస్టారూ.. నేను అమ్మనా? ఎప్పుడు అయ్యాను? ఎవరికి? అమ్మనా.. బొమ్మనా.. ఏం మాట్లాడుతున్నారు? మీరు కన్న బిడ్డకు నన్ను తల్లిని చేస్తారా? నన్ను అమ్మా అని ఎలా పరిచయం చేస్తారు? వాడికి నాన్నకి పెళ్లామని లేకపోతే కళావతి మొగుడిని అని చెప్పండి వాడికి.. లేదంటే బతకడం చేతకాని తింగరి బుచ్చమ్మా అని పరిచయం చేయండి. అంతగా ఉబలాటంగా ఉంటే.. ఇంట్లోని వారందర్నీ వాడికి పరిచయం చేయండి. ఇలా రాజ్ కి మాస్ క్లాస్ ఇస్తుంది కావ్య. కళావతి ఇచ్చిన మాస్ క్లాస్‌కి రాజ్ స్టన్ అయిపోతాడు.

వెన్నెల గుట్టు బయట పెట్టేందుకు కావ్య ప్రయత్నం..

ఆ తర్వాత వెన్నెల గురించి ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు. ఆ సలహా ఏదో ఈయన్నే ఇన్ డైరెక్టుగా అడగాలి. నాకో సలహా కావాలి అని అడుగుతుంది కావ్య. ఏంటో అది అడుగు అని రాజ్ అంటాడు. నాకో చిన్నప్పటి ఫ్రెండ్ ఉంది. అది ఎక్కడ ఉందో ఏం చేస్తుందో తెలీడం లేదు. దాని అడ్రెస్ వెతికి పట్టుకోవాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది కావ్య. ఇంత సడెన్‌గా ఆ చిన్నప్పుడు ఫ్రెండ్ ఎందుకు గుర్తుకు వచ్చిందో అని రాజ్ అడుగుతాడు. ఎందుకంటే దాని మొగుడు కూడా ఓ కొడుకును తీసుకొచ్చి.. నా బాబు అని పరిచయం చేశాడు కాబట్టి. అప్పుడు అది ఏనిర్ణయం తీసుకుందో నాకు తెలియాలి అని కావ్య అంటుంది. జోకా అని రాజ్ అడుగుతాడు. కాదు.. చెప్పండి అని కావ్య అడుగుతుంది. సోషల్ మీడియాలో ట్రై చేయ్.. లేదంటే మీకు ఉండే కామన్ ఫ్రెండ్స్‌ని అడిగి తెలుసుకో అని రాజ్ చెప్తాడు. ఈ ఐడియా ఏదో బాగానే ఉందని కావ్య మనసులో అనుకున్నా.. బయటకు మాత్రం రాజ్‌ని తిడుతుంది.

కళ్యాణ్‌కు చెక్ పవర్.. పండగ చేసుకున్న అనామిక..

మరోవైపు ఇంటికి లాయర్ వస్తాడు. అదేంటి? ఏదో ముఖ్యమైన పని ఉంటేనే గాని మీరు ఇంటికి రారు కదా.. ఎవరు రమ్మన్నారు అని అడుగుతారు. నేనే రమ్మన్నాను.. అని రాజ్ వచ్చి చెప్తాడు. నా మనసుకు ఏదో కీడు శంకిస్తుంది. ఏదన్నా ఉంటే.. ముందు మాతో చర్చించు రాజ్ అని అపర్ణ అంటే.. నేను ఏ నిర్ణయం తీసుకోలేదు మామ్. మీరంతా కలిసి ఆమోదించిందే.. నేను సమ్మతించాను అని రాజ్ అంటాడు. ఏంట్రా ఆ నిర్ణయం.. ఈ ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నారు కదా? తరతరాలుగా వస్తున్న కొన్ని నిబంధనలను మర్చిపోయావా? అని పెద్దావిడ అడుగుతుంది. నేను బిడ్డతో ఆఫీస్‌కు వెళ్లడం.. పరువు నష్టంగా భావించి.. కంపెనీ నుంచి తప్పుకోమని చెప్పారు. అదే రోజు కళ్యాణ్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా చేయడానికి బాధ్యతలు స్వీకరించాడు. ఇవేమీ నేను తీసుకున్న నిర్ణయాలు కావు. కళ్యాణ్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాడు కదా.. అందుకే వాడి పేరు మీద పవరాఫ్ పఠానీ రాసివ్వాలని అనుకుంటున్నా, లీగల్ గా చెక్ పవర్ ట్రాన్స్ లేట్ చేయాలనుకుంటున్నా అని రాజ్ చెప్పగానే.. ఇంట్లోని వారందరూ షాక్ అవుతారు. మధ్యలో అనామిక మాత్రం.. ఆహా.. కళ్యాణ్‌తో ఒక్క చెక్కు మీద సంతకం తీసుకుంటే చాలు..నా పుట్టింటి అప్పులన్నీ తీరిపోతాయ్ అని అనుకుంటుంది.

నా భర్తను అనామకుడిలా చూడలేను..

రాజ్ ఏంట్రా ఇది.. ఏం చేస్తున్నావ్? ఇప్పుడు అంత అవసరం ఏం వచ్చింది? నీ భర్త అన్ని స్థానాలూ వదులుకుంటున్నాడు? మాట్లాడవేంటి? నీ అభిప్రాయాలు చెప్పవా? అని పెద్దావిడ అడుగుతుంది. నా అభిప్రాయం ఎవరికి కావాలి? ఈ ఇంట్లో ఎప్పుడూ నన్ను సభ్యురాలిగా గుర్తించలేదు. ఆయన భార్యగా ఎలాంటి అభిప్రాయాలూ చెప్పలేను. మా ఆయన కూడా ఓ పురుషోత్తముడు. ఆయనకి నేనేం చెప్పగలను? అని కావ్య అంటే.. కళావతి అని రాజ్ అంటాడు. ఈ ఇంట్లో ఎవ్వరూ తప్పుగా అన్నారా? కేవలం బిడ్డ ఎవరు? తల్లి ఎవరు అని అడిగారు. మీ దగ్గర సమాధానం లేదు. ఆ బిడ్డ కోసం మీరు అన్నింటికీ దూరం అయ్యారు. ఎందుకు? ఇప్పటికైనా నిజాన్ని చెప్పండి అని నిలదీస్తుంది. దుగ్గిరాల వంశానికి నిజమైన వారసుడు మాత్రం ముమ్మాటికీ నా భర్తే. ఆయన్ని ఆ స్థాయిలో చూసిన దాన్ని. సర్వస్వం వదులుకుని ఈ ఇంట్లో అతిథిగా ఉండటం నేను చూడలేను. కవిగారికి నా భర్త ఆస్తి మొత్తం రాసిచ్చినా నాకు అవసరం లేదు. కానీ రాజు ఎప్పుడూ సింహాసనం మీదనే ఉండాలి. పరివారం మధ్య కాదు. నా భర్త కంపెనీ అధినేతగానే ఉండాలి. ఆయన తీసుకున్న నిర్ణయానికి ఆ బిడ్డే కారణం కాబట్టి.. పరిష్కారం దిశగా అందరూ మాట్లాడాలని కావ్య అంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..