Brahmamudi, April 25th episode: గుడిలో అనామికను కొట్టిన కళ్యాణ్.. రాజ్‌పై మీడియా ప్రశ్నలు..

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావాలని కనకాన్ని రెచ్చగొడుతుంది రుద్రాణి. అయితే తన స్టైల్లో రుద్రాణికి గడ్డి పెడుతుంది కనకం. ఆస్తి కోసం మొగుడిని వదిలేసి.. పుట్టింట్లో పడి తింటున్న నిన్ను చూశాక.. నా కూతురికి అంత గతి పట్టనివ్వను అని చెబుతూ కనకం వెళ్తుంది. అప్పుడే అనామిక వచ్చి ఆంటీ.. ఆవిడ మిమ్మల్ని ఏదో అంటుంది. ఆస్తి కోసం అంకుల్ ని మీరు వదిలేశారా? అని అడుగుతుంది. కనకానికి ఏం తెలుసు..

Brahmamudi, April 25th episode: గుడిలో అనామికను కొట్టిన కళ్యాణ్.. రాజ్‌పై మీడియా ప్రశ్నలు..
Brahmamudi
Follow us

|

Updated on: Apr 25, 2024 | 12:11 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావాలని కనకాన్ని రెచ్చగొడుతుంది రుద్రాణి. అయితే తన స్టైల్లో రుద్రాణికి గడ్డి పెడుతుంది కనకం. ఆస్తి కోసం మొగుడిని వదిలేసి.. పుట్టింట్లో పడి తింటున్న నిన్ను చూశాక.. నా కూతురికి అంత గతి పట్టనివ్వను అని చెబుతూ కనకం వెళ్తుంది. అప్పుడే అనామిక వచ్చి ఆంటీ.. ఆవిడ మిమ్మల్ని ఏదో అంటుంది. ఆస్తి కోసం అంకుల్ ని మీరు వదిలేశారా? అని అడుగుతుంది. కనకానికి ఏం తెలుసు.. ఏది పడితే అది వాగుతుంది అని రుద్రాణి అంటుంది. మరి అయితే మావయ్య గారు సన్యాసంలో కలిసిపోయాడా? ఈవిడ కథ విన్నా.. చదివినా అష్ట దరిద్రాలూ చుట్టుకుంటాయి. పదా గుళ్లో పిశాచాల పిట్ట కథలు మనకెందుకు? అని స్వప్న అంటుంది. ఆ తర్వాత రామాయణం గురించి వివరంగా చెబుతారు పంతులు గారు. రామాయణం అనేది.. బ్రతుకు పుస్తం అని చెప్తారు. శ్రీ రాముడు, సీత గురించి గొప్పతనం గురించి చెప్తారు. భార్యాభర్తల బంధం గురించి వివరిస్తూ ఉంటాడు.

కళ్యాణ్ చేయి పట్టుకున్న అప్పూ..

ఈలోపు కళ్యాణ్‌ని రమ్మని సైగ చేస్తుంది అప్పూ. కళ్యాణ్‌ బయటకు రాగానే.. ఏదో జరుగుతుందిరా భయ్. మీ ఫ్యామిలీలోనే ఎవరో మీడియాతో మాట్లాడుతున్నారు. మీ ఫ్యామిలీ పరువు తీయ్యాలని చూస్తున్నారు. ఆ బాబు గురించి ఏదో కనుక్కోవాలని చెబుతున్నారు అని చెప్తుంది. అవును ఆ బాబు వచ్చిన దగ్గర్నుంచి ఇంట్లో ఏవో గొడవలు. బాబు విషయంలో మీడియా వాళ్లు కూడా ఇంటి పరువు తీసినట్టు మాట్లాడితే.. మా పెద్దమ్మ అన్నయ్యని అస్సలు క్షమించదు. ఏదో ఒకటి చేసి దీన్ని ఆపాలి అని కళ్యాణ్ వెళ్తుండగా.. అప్పూ అతని చేయి పట్టుకుంటుంది.

పగిలిన అనామిక చెంప..

సరిగ్గా అప్పుడే అనామిక వచ్చి.. అప్పూ అని గట్టిగా అరుస్తుంది. వెంటనే అనామిక చేయి వదిలేస్తుంది. ఎందుకు వదిలేశావ్? పట్టుకో.. గుడి అయితే ఏంటి? బడి అయితే ఏంటి? నీకు కావాల్సింది నా మొగుడే కదా. సిగ్గుండాలి నీకు.. అసలు నువ్వు ఆడదానివేనా? అని అంటుంది అనామిక. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడకు అనామిక.. అని అప్పూ చెప్పబోతుండగా.. ఆపవే.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాక కూడా.. ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నావ్ ఏంటి? అంటూ ఫ్యామిలీ గురించి తక్కుగా మాట్లాడుతుంది. ఏం బతుకులే మీవి ఛీ.. అని అంటుంది అనామిక. కళ్యాణ్ కూడా సర్ది చెప్పాలని చూస్తాడు. అయినా వినిపించుకోని అనామిక.. నువ్వు దీంతో కులుకుతావా.. ఛీ ఛీ మీ బుద్ధులే అంత.. అప్పూని తల్లిని చేసి.. ఇంకో బిడ్డను ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నావా? అని అనామిక అనగానే.. కళ్యాణ్ చాచి పెట్టి ఒక్కటి ఇస్తాడు. నన్ను కొడతావా? నన్నే కొడతావా.. చెప్తా.. దీనికి ఇంతకు ఇంత బదులు తీర్చుకోకపోతే.. నా పేరు అనామికే కాదు అని అంటుంది.

ఇవి కూడా చదవండి

మీడియాతో కళ్యాణ్ చర్చ..

ఆ తర్వాత కళ్యాణ్, అప్పూలు మీడియా అమ్మాయి దగ్గరకు వస్తారు. హలో మీతో పర్సనల్‌గా మాట్లాడాలి అని అంటుంది. ఇక్కడ ఎవరూ లేరు కదా సర్.. చెప్పండి అని మీడియా అమ్మాయి చెబుతుంది. హలో ఎందుకు అబద్ధాలు చెబుతున్నావ్.. నువ్వు ఫోన్‌లో మాట్లాడటం నేను విన్నాను అని అప్పూ అంటుంది. మీడియాగా అన్నీ తెలుసుకోవడం మా హక్కు. అయినా ఇప్పటివరకూ చిన్న డౌట్ ఉండేది. కానీ మీరు ఇప్పుడు ఇలా అడుగుతున్నారో.. అప్పుడే నాకు అర్థం అయింది. మీ అన్నయ్య తప్పు చేశారని చెబుతుంది. అలా అని ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెడుతారా? అని కళ్యాణ్ అడిగితే.. చూడండి సర్.. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే.. చూస్తూ ఊరుకోవడానికి మీరేమీ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు కాదు. మా డ్యూటీ మేము చేస్తాం. తప్పు ఉంటే మీరు చేయాల్సింది చేయండి అని అంటుంది.

రాజ్‌కు మీడియా ప్రశ్నలు..

ఆ తర్వాత రాజ్ దగ్గరకు వచ్చిన కళ్యాణ్.. అన్నయ్యా నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్లి పోవాలి అని అంటాడు. ఏమైందిరా అని రాజ్ అడిగే లోపే.. మీడియా వస్తుంది. ఇందాక పూజకు లేట్ అవుతుందని మీరు చెప్పారని.. అడగాల్సిన ప్రశ్నలు ఆపేశాం. ఈలోపు ఇక్కడ చాలా పెద్ద గొడ జరిగిందని విన్నాం. రాజ్ గారికి కళ్యాణం చేసే అర్హత లేదని మీ ఇంటి కోడలే అభ్యంతరం చెప్పిందని తెలిసింది. దీనికి మీరేం చెప్తారు? దుగ్గిరాల వారసుడిగా ఆఫీస్‌ నుంచి తప్పుకున్నారని తెలిసింది. ఈ బిడ్డ గురించి కూడా ఏవోవో వినిపిస్తున్నాయి. మీరు ఇంకెవరితోనే సంబంధం పెట్టుకున్నారని వినిపిస్తుంది. అని మీడియా ప్రశ్నలు అడుగుతారు. కానీ ఎవరూ ఏమీ చెప్పరు. స్టాపిట్.. ఇవన్నీ మీకు ఎవరు చెబుతున్నారు? ఇవన్నీ అబద్ధాలే అని కళ్యాణ్ అంటాడు.

మా బిడ్డే.. బాంబు పేల్చిన కావ్య..

ఇక చాలు.. ఇప్పటికే మీరందరూ ఎన్నో ప్రశ్నలు వేశారు. ఎన్నో కథనాలు అల్లారు. కానీ ఒక్కటి కూడా ఆధారం లేని ఆరోపణలే. మా కుటుంబంలో సంక్షోభం ఉందా.. అదే జరిగితే.. మా కుటుంబం మొత్తం ఇక్కడే ఉంది.. కలిసే ఉంది. దీనికి ఏమంటారు? అని కావ్య అంటే.. ఏమంటారు? అని కనకం కూడా అడుగుతుంది. అసలు ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చింది ఎవరు? ముందు అది చెప్పండి? అని కనకం అడిగితే.. తెలిస్తే నువ్వేం చేస్తావ్? అని రుద్రాణి అడుగుతుంది. తన మాస్ స్టైల్‌లో జవాబు చెబుతుంది కనకం. అయినా ఈ విషయం అందరికీ తెలిసింది. ప్రపంచమంతా చర్చించుకుంటున్నారు. అన్నింటికీ ఈ బాబే కారణం అని అనుకుంటున్నారు. ఇంతకీ ఈ బిడ్డ ఎవరు అని మీడియా ప్రశ్నిస్తుంది. దీంతో ఈ బిడ్డ మా బిడ్డే అని కావ్య చెబుతుంది. అది విని అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత మీడియా అపర్ణను ప్రశ్నిస్తుంది. ఇక ఆ ప్రశ్నలు భరించలేక.. అపర్ణ కూడా అవును అని గట్టిగా అరుస్తూ.. వెళ్లి పోతుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Brahmamudi

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..