Bigg Boss 10 Telugu : నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. ఐదో వారం లిస్ట్ ఇదే.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు కంటెస్టెంట్లు!

‏ బిగ్ బాస్ ఇంట్లో ఐదో వారం నామినేషన్ ప్రక్రియ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టార్గెట్ అపూర్వ, అమన్, త్రిగుణ్ ఇలా కంటెస్టెంట్స్ మధ్య ఓ రేంజ్ లో రచ్చ జరిగింది. మరీ ముఖ్యంగా అపూర్వ, త్రిగుణ్ మధ్య మాటల యుద్దం జరిగింది. మొత్తానికి ఐదో వారంలో నామినేషన్లలలోకి ఊహించని కంటెస్టెంట్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి హౌస్ నుంచి బయటకు వెళ్లేది ఎవరు అనేది ఆసక్తిగా మారింది.

Bigg Boss 10 Telugu : నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. ఐదో వారం లిస్ట్ ఇదే.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు కంటెస్టెంట్లు!
Bigg Boss 10 Telugu (6)

Updated on: Oct 06, 2026 | 6:58 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఐదో వారానికి చేరుకోవడంతో హౌస్‌లో నామినేషన్ల వేడి తీవ్ర స్థాయికి చేరింది. ప్రతి వారంలాగే ఈసారి కూడా నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, మాటల యుద్ధం ఓ రేంజ్‌లో నడిచాయి. ముఖ్యంగా అపూర్వ, త్రిగుణ్, రోహిత్, ముఖేష్, వర్షిణిల మధ్య తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. నిన్న జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఐదో వారం నామినేషన్ ప్రక్రియ రణరంగంగా మారింది. తాజా ప్రోమో ప్రకారం, కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటింది. ముఖ్యంగా అపూర్వను మిగిలిన హౌస్‌మేట్స్ కార్నర్ చేసినట్లు కనిపిస్తోంది. అపూర్వ కెప్టెన్సీ తీరుపై ముఖేష్, వర్షిణిలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వర్షిణి “వర్స్ట్ కెప్టెన్” అని అరుస్తూ అపూర్వపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అపూర్వ , త్రిగుణ్ మధ్య జరిగిన మాటల సమరం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. మరోవైపు త్రిగుణ్, అపూర్వల మధ్య వ్యక్తిగత దూషణల వరకు గొడవ వెళ్ళింది. రామ్ ప్రసాద్ ఫిజికల్ గేమ్‌ను కారణం చూపి అమన్‌ను నామినేట్ చేయగా, రోహిత్, వంశీల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం జరిగింది. మొత్తానికి ఈ వారం నామినేషన్ రచ్చ హౌస్‌లో కాకరేపుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఐదో వారంలో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయినట్లు తెలుస్తోంది. త్రిగుణ్, అమన్, షాలినీ, చరణ్, అపూర్వ, రోహిత్, రామ్ ప్రసాద్ ఈ ఏడుగురు నామినేట్ అయినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు వీరిలో ఎవరు టాప్ లో ఉండనున్నారు.. ఎవరు డేంజర్ జోన్ లో ఉండనున్నారనే విషయం ఇప్పుడే నెట్టింట తెగ చర్చ నడుస్తుంది.

డేంజర్ జోన్‌లో ఉన్నది ఎవరంటే?

ఈ వారం నామినేషన్ల లిస్ట్‌ను పరిశీలిస్తే, ప్రధానంగా అమన్, షాలినీ, చరణ్ ఈ ముగ్గురూ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు సమాచారం. షాలినీ: గత వారమే షాలినీ ఎలిమినేషన్ అంచు వరకు వెళ్ళి తృప్తిగా సేవ్ అయింది. రోహిత్‌తో కలిసి ఫేక్ లవ్ ట్రాక్ నడిపిస్తుండటం, హౌస్‌లో అనవసరంగా కేకలు వేయడం ఆడియెన్స్‌కు చిరాకు తెప్పిస్తోందని టాక్. ఈ తీరు మార్చుకోకపోతే ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

చరణ్: ఇంట్లో ఎలాంటి పర్ఫామెన్స్ ఇవ్వకుండా, ఆటలో అసలు కనిపించకుండా చరణ్ ఇప్పటివరకు ఎలా సర్వైవ్ అవుతున్నాడనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. హోస్ట్ నాగార్జున కూడా చరణ్ ఆటతీరుపై కౌంటర్లు వేశారు. ఈ వారంలో కూడా అతని ప్రదర్శన మారకపోతే ఎలిమినేషన్ ఖాయంగా కనిపిస్తోంది.

అమన్ & అపూర్వ: అపూర్వ రాకతో ఆట మారుతుందనుకున్నా, గొడవల తప్ప ఆమె ప్రత్యేకంగా ఏమీ చూపించలేకపోతోంది. ఇక అమన్ ఆటపట్ల కూడా ప్రేక్షకులకు అంతగా ఆసక్తి లేనట్లు కనిపిస్తోంది.

అదే సమయంలో, రోహిత్, త్రిగుణ్ , రామ్ ప్రసాద్‌లకు బయట మంచి ఫాలోయింగ్ ఉండటంతో వారు ప్రస్తుతం సేఫ్ జోన్‌లోనే ఉన్నారని భావిస్తున్నారు. మొత్తానికి ఈ ఐదో వారం ఎలిమినేషన్ అగ్నిపరీక్షగా మారనుండగా, అమన్, షాలినీ, చరణ్‌లలో ఒకరు ఇంటికి వెళ్లే అవకాశం మెండుగా ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us