రాజమౌళికి ఎంపీ సోయం బాపురావు వార్నింగ్‌

దర్శకధీరుడు రాజమౌళికి ఎంపీ సోయం బాపురావు వార్నింగ్ ఇచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో భీమ్‌ పాత్రకు పెట్టిన టోపీని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు

  • Updated On - 12:11 pm, Tue, 27 October 20 Edited By:
రాజమౌళికి ఎంపీ సోయం బాపురావు వార్నింగ్‌

MP Warns Rajamouli: దర్శకధీరుడు రాజమౌళికి ఎంపీ సోయం బాపురావు వార్నింగ్ ఇచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో భీమ్‌ పాత్రకు పెట్టిన టోపీని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదని అలానే విడుదల చేస్తే థియేటర్లను తగులబెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. కలెక్షన్ల కోసం తమ ఆరాధ్య దైవాన్ని కించ పరిస్తే సహించబోమని, నైజాంకు వ్యతిరేకంగా పోరాడిన కొమరం భీమ్‌ అమరుడయ్యారని బాపురావు తెలిపారు. భీమ్‌ని చంపిన వాళ్ల టోపీని ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమేనని.. రాజమౌళి ఇప్పటికైనా చరిత్రను తెలుసుకోవాలని, లేదంటే మర్యాదగా ఉండదని ఆయన హెచ్చరించారు.

అయితే ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌లతో రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్‌ పాత్రలో నటిస్తుండగా.. ఆయన టీజర్‌ని ఈ నెల 22న విడుదల చేశారు. అందులో ఎన్టీఆర్ ముస్లిం టోపీ పెట్టుకొని కనిపించారు. దీంతో వివాదం మొదలైంది. గిరిజనుల మనోభావాలను దెబ్బతీయడం సరైంది కాదని, ఆ సన్నివేశాలను తొలగించాలని ఆదివాసులు సహా పలువురు డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఈ మూవీకి సంబంధించిన ప్రెస్‌మీట్‌ పెట్టిన సమయంలో రాజమౌళి ఓ క్లారిటీని ఇచ్చారు. ఈ మూవీలో రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారని తెలిపారు. కానీ ఇది వారి జీవిత చరిత్ర కాదని.. రియల్‌ లైఫ్‌ కారెక్టర్‌లతో ఫిక్షన్ కథాంశంతో ఆర్‌ఆర్‌ఆర్‌ ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ఇది దేశభక్తి చిత్రం కూడా కాదని టీమ్ ఆ మధ్యన ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చింది. కానీ అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ పేర్లతో టీజర్లు రావడంతో.. ఈ ప్రాజెక్ట్‌ వారి జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు పలువురు భావిస్తున్నారు.

Read More:

మురళీధరన్‌ బయోపిక్‌: సేతుపతి కంటే ముందు ఆ స్టార్ హీరోను సంప్రదించారా..!

వారిని బేషరతుగా విడుదల చేయండి.. చిత్తూరు జిల్లా ఎస్పీకి బాబు లేఖ