‘బిగ్‌బాస్‌’ బ్యూటీతో తేజ బోల్డ్‌ వెబ్‌ సిరీస్‌!

| Edited By:

Jul 31, 2020 | 9:15 AM

ప్రస్తుతం డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ల హవా నడుస్తోంది. ముఖ్యంగా వెబ్‌ సిరీస్‌లకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది.

బిగ్‌బాస్‌ బ్యూటీతో తేజ బోల్డ్‌ వెబ్‌ సిరీస్‌!
Follow us on

Teja Web Series with Bigg Boss Beauty: ప్రస్తుతం డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ల హవా నడుస్తోంది. ముఖ్యంగా వెబ్‌ సిరీస్‌లకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. సినిమాలతో పోలిస్తే వెబ్‌ సిరీస్‌లకు తక్కువ ఖర్చు అవుతుండటం, సమయం కూడా తక్కువ పడుతుండటంతో అందరి దృష్టి ఇప్పుడు వెబ్‌ సిరీస్‌లవైపు మళ్లుతోంది. చిన్న నటీనటులే కాదు స్టార్ హీరో హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు ఇప్పుడు వెబ్‌ సిరీస్‌లపై ఆసక్తిని చూపుతున్నారు. ఇక టాలీవుడ్‌లోనూ పలువురు దర్శకులు వెబ్ సిరీస్‌లు చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఈ క్రమంలో బిగ్‌బాస్‌ బ్యూటీ నందినీ రాయ్‌తో స్టార్ దర్శకుడు తేజ ఓ బోల్డ్ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు దీనికి సంబంధించి ఇప్పటికే తేజ షూటింగ్‌ను ప్రారంభించినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా తేజ.. గోపిచంద్‌తో ‘అలివేలుమంగ వేంకటరమణ’, రానాతో ‘రాక్షసరాజు రావణాసురుడు’ చిత్రాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ‘అలివేలుమంగ వేంకటరమణ’ ఈ ఏడాది చివరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read This Story Also: ఆటల పోటీలతో 54 మంది కానిస్టేబుళ్లకు కరోనా