Tapsee: ఆకట్టుకుంటోన్న తాప్సీ కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌.. ఇంతకీ తను అక్కడ అలా ఎందుకు ఉంది..?

|

Feb 03, 2021 | 5:43 AM

Taapsee LooopLapeta First Look: 'ఝుమ్మంది నాధం' సినిమాతో వెండితెరకు పరిచయమైంది అందాల తార తాప్సీ పన్ను. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ అనంతరం ముంబై బాట పట్టింది. మొదట్లో...

Tapsee: ఆకట్టుకుంటోన్న తాప్సీ కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌.. ఇంతకీ తను అక్కడ అలా ఎందుకు ఉంది..?
Follow us on

Taapsee LooopLapeta First Look: ‘ఝుమ్మంది నాధం’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది అందాల తార తాప్సీ పన్ను. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ అనంతరం ముంబై బాట పట్టింది. మొదట్లో అక్కడ సరైన విజయాలు అందుకోలేక తడబడిన ఈ చిన్నది ‘పింక్‌’ చిత్రంతో ఒక్కసారిగా స్పీడ్‌ పెంచింది.
తప్పడ్‌, గేమ్‌ ఓవర్‌, బద్లా, మిషన్ మంగల్‌ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన తాప్సీ.. వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఈ క్రమంలోనే మరో వినూత్న కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తోందీ అందాల భామ. ‘లూప్‌ లాపెటా’ పేరుతో తెరకెక్కుతోన్న సినిమా ఫస్ట్‌ లుక్‌ తాజాగా విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌లో తాప్సీ బాత్రూమ్‌ సీట్‌పై చేతిలో కాగితం ముక్క పట్టుకొని కూర్చొని కనిపిస్తోంది. ఇలా ఫస్ట్‌లుక్‌తోనే ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఈ ఫొటోతో పాటు ఆసక్తికరమైన క్యాప్షన్‌ను సైతం జోడించిందీ బ్యూటీ. ఈ ఫొటోతో పాటు.. ‘కొన్నిసార్లు జీవితంలో మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన సమయం వస్తుంది. నేను ఇక్కడ ఎలా ఉన్నాను? నేనూ అదే ఆలోచిస్తున్నాను. నేను అంటోంది జీవితంలో ఎదురయ్యే గందరగోళం గురించి. హాయ్‌ నా పేరు నవి.. ఈ క్రేజీ రైడ్‌ కోసం సిద్ధంగా ఉన్నాను’ అంటూ ఇంట్రెస్టింగ్‌ క్యాప్షన్‌ జోడించిందీ బ్యూటీ. ఈ లెక్కన చూస్తుంటే తాప్సీ మరో హిట్‌ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకునేట్లు కనిపిస్తోంది.

Also Read: సూపర్ ఛాన్స్ కొట్టేసిన ఈషారెబ్బా.. భారీ ప్రాజెక్టులో కీలక పాత్రలో నటించనున్న తెలుగమ్మాయి..