కంగనాపై సుశాంత్‌ ఫ్యామిలీ లాయర్ కీలక వ్యాఖ్యలు

నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్‌లో నెపోటిజం మరోసారి వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా కంగనా రనౌత్ నెపోటిజంపై విరుచుకుపడుతున్నారు

కంగనాపై సుశాంత్‌ ఫ్యామిలీ లాయర్ కీలక వ్యాఖ్యలు

Updated on: Aug 22, 2020 | 1:05 PM

Sushant Lawyer on Kangana: నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్‌లో నెపోటిజం మరోసారి వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా కంగనా రనౌత్ నెపోటిజంపై విరుచుకుపడుతున్నారు. నెపోటిజం బ్యాచ్‌ సుశాంత్‌ని తొక్కిందని, కరణ్ జోహార్ వంటి వారి వలనే సుశాంత్ కుంగిపోయాడని ఆమె ఆరోపణలు చేస్తూ వస్తోంది. అంతేనా ఇదే వంకతో బాలీవుడ్‌పై తనకున్న కోపాలను కూడా ఆమె బయటపెడుతోంది. దీంతో ఆమె వ్యాఖ్యలను పలువురు ఖండిస్తున్నారు. సుశాంత్ కేసును కంగనా తనకు అనుకూలంగా మలుచుకుంటోందంటూ విమర్శలు చేశారు. ఇక తాజాగా సుశాంత్‌ తండ్రి కేకే తరపు లాయర్‌ వికాస్ సింగ్ సైతం కంగనాపై కీలక వ్యాఖ్యలు చేశారు.

”సుశాంత్ కేసు విషయంలో కంగనా ప్రత్యేక అజెండాతో ముందుకు వెళుతోంది. వ్యక్తిగతంగా తనకు ఇబ్బందులను వారిని ఆమె టార్గెట్ చేస్తోంది. తన సొంత దారిలో ఆమె వెళుతోంది. ఆమె ఆరోపణలకు, సుశాంత్ కుటుంబానికి సంబంధం లేదు. ఇండస్ట్రీలో నెపోటిజం ఉందన్న విషయం అందరికీ తెలుసు. సుశాంత్ కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ ఈ కేసుకు అది ప్రధానం కాదు. రియా, ఆమె గ్యాంగ్‌ సుశాంత్‌ను ఎంత ఇబ్బంది పెట్టారు, అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటన్నదే అతడి కుటుంబానికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది” అని వికాస్ వెల్లడించారు.

Read More:

 హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్‌.. వెల్లువెత్తుతోన్న శుభాకాంక్షలు

తమిళులపై ‘హిందీ’ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు

Loading...
Unable to load recommendations.
Follow Us