Subhalekha Sudhakar: స్టార్ హీరో అయినా చిన్న పిల్లాడి మనస్తత్వం.. ఆయనలో గొప్ప లక్షణం అదే.. సుభలేఖ సుధాకర్..

టాలీవుడ్ స్టార్ హీరో గురించి నటుడు సుబ్బలేఖ సుధాకర్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఆయనను చిన్నపిల్లాడి మనస్తత్వమున్న మంచి వ్యక్తిగా సుధాకర్ తెలిపారు. తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు బాలకృష్ణ, చిరంజీవి ఇచ్చిన మానసిక ధైర్యాన్ని గుర్తుచేసుకున్నారు. వారి అంకితభావం, నిబద్ధతను ప్రశంసించారు. అలాగే ఆ ఇద్దరూ హీరోలతు తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Subhalekha Sudhakar: స్టార్ హీరో అయినా చిన్న పిల్లాడి మనస్తత్వం.. ఆయనలో గొప్ప లక్షణం అదే.. సుభలేఖ సుధాకర్..
Subhalekha Sudhakar

Updated on: Oct 29, 2026 | 11:21 AM

సీనియర్ నటుడు సుబ్బలేఖ సుధాకర్ నటసింహం నందమూరి బాలకృష్ణతో తనకున్న అనుబంధం, బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాలకృష్ణ చిన్నపిల్లాడి మనస్తత్వమున్న వ్యక్తి అని, అత్యంత నిష్కపటంగా, దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారని సుబ్బలేఖ సుధాకర్ అన్నారు. షూటింగ్ సెట్స్‌లో నటీనటులకు ఆయన పూర్తి స్వేచ్ఛను ఇస్తారని, అయితే ఆ స్వేచ్ఛను ఎంతవరకు ఉపయోగించుకోవాలనేది నటుడి చేతుల్లోనే ఉంటుందని సుధాకర్ స్పష్టం చేశారు. తన జీవితంలో ఒక క్లిష్టమైన సమయంలో, అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ఉన్నప్పుడు బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ తనకు అండగా నిలిచారని సుబ్బలేఖ సుధాకర్ భావోద్వేగంతో వెల్లడించారు. సుమారు 54 రోజుల పాటు రోజువారీగా వారు ఫోన్ చేసి తన యోగక్షేమాలను అడిగి తెలుసుకునేవారని, అది తనకు ఎంతో మానసిక ధైర్యాన్ని ఇచ్చిందని, ఆ అనుబంధం జీవితాంతం తనతో ఉంటుందని కృతజ్ఞతలు తెలిపారు. అప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితిలో వారిద్దరి మద్దతు ఎంతో విలువైనదిగా పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..

బాలకృష్ణతో తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన జననీ జన్మభూమి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను సుబ్బలేఖ సుధాకర్ గుర్తుచేసుకున్నారు. షూటింగ్‌లో తాను కామెర్ల బారిన పడి, పసలపూడిలో స్థానిక ఆసుపత్రిలో చేరినప్పుడు, బాలకృష్ణ ప్రతిరోజూ ఉదయం షూటింగ్‌కు వెళ్లే ముందు, సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు తనను పరామర్శించేవారని తెలిపారు. ఆ సంఘటన బాలకృష్ణలోని ఆప్యాయతను, స్నేహశీలి స్వభావాన్ని తెలియజేస్తుందని అన్నారు. ఆయనలో అప్పట్లో ఉన్న కన్సర్న్, బ్రదర్‌హుడ్ ఇప్పటికీ అలాగే ఉందని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..

బాలకృష్ణలో ఎనర్జీ లెవెల్స్ ఎప్పటికీ తగ్గవని, అది ఆయన ప్రత్యేకత అని సుబ్బలేఖ సుధాకర్ అన్నారు. ఇదే విషయం మెగాస్టార్ చిరంజీవి విషయంలో కూడా నిజమని, వారిద్దరూ అలాగే ఉండాలని అన్నారు. బాలకృష్ణ, చిరంజీవిల నుండి నేర్చుకోవాల్సిన గొప్ప విషయం నెవర్ గివ్ అప్ ఆటిట్యూడ్ అని సుధాకర్ అన్నారు. పని పట్ల వారి కసి, పట్టుదల, సానుకూల దృక్పథం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ముఖ్యంగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి చిత్రాలతో బాలకృష్ణ యువతరం హీరోలకు ధీటుగా రాణిస్తున్నారని, తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. భగవంత్ కేసరిలోని బాలికల స్టేజ్ సీన్ ఎంతగానో కదిలించిందని అన్నారు. బాలకృష్ణ సినీ ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శమని సుబ్బలేఖ సుధాకర్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

శుభలేఖ సుధాకర్.. బాలకృష్ణ..

Subhalekha Sudhakar, Balakr

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

Loading...
Unable to load recommendations.
Follow Us