Surya’s new look : సూర్యను చూసి సంబరపడుతున్న అభిమానులు.. నాచురల్ లుక్‌‌‌‌‌‌లో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో

తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవల ఆకాశం నీహద్దురా సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో చాలా రోజులతర్వాత సూర్య..

Suryas new look : సూర్యను చూసి సంబరపడుతున్న అభిమానులు.. నాచురల్ లుక్‌‌‌‌‌‌లో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో

Updated on: Jan 05, 2021 | 10:59 AM

Surya’s new look : తమిళ స్టార్ హీరో సూర్య ఇటీవల ‘ఆకాశం నీ హద్దురా’సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత సూర్య సక్సెస్ ను అందుకున్నాడు. సూర్యకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలు ఇక్కడ కూడా బాగా ఆడుతాయి. ఇదిలా ఉంటే తాజాగా సూర్య లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

చాలామంది హీరోలు మేకప్ లేకుండా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతారు. స్టార్ హీరో అజిత్ తెల్ల జట్టు తెల్ల గడ్డంతో మేకప్ లేకుండా నాచురల్ గా ఉంటారు. అభిమానులకు కూడా ఆయన అలా ఉండటమే ఇష్టం. తాజాగా సూర్య కూడా అలానే కనిపించి ఆకట్టుకుంటున్నారు. తాజాగా సూర్య తన హౌమ్ జిమ్ లో కసరత్తులు చేస్తూ ఆన్ లైన్ ద్వారా తన ట్రైనర్ ఇచ్చే సూచనలను పాటించారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సూర్య ఈ లుక్ లో చాలా విభిన్నంగా ఉన్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సూర్య తెల్ల గడ్డం రావడంతో పాటు జట్టు కూడా కాస్త ఎర్రగా అయ్యింది. ఇక సూర్య ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నడని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చూడండి : 

Sai Pallavi In Pushpa: ‘పుష్ప’లో ‘ఫిదా’ బ్యూటీ.. అల్లు అర్జున్‌తో అలా నటించడానికి ఒప్పుకుంటుందా..?

Rakul Insta Post: రకుల్‌ కొత్తేడాది తీర్మానం ఏంటో తెలుసా..? ‘గతాన్ని మార్చలేం కాబట్టి’..