Bigg Boss-4: తెలుగు జనాల మనుసులు గెలిచిన గోదావరిఖని కుర్రాడు.. ఇకనుంచి మటన్, చికెన్ కథ వేరేగా ఉంటది..

Bigg Boss-4: చికెన్​.. మటన్​.. చికెన్​.. మటన్​.. చికెన్​..మటన్​ అంటూ బిగ్​ బాస్​ హౌస్​లో సందడి చేసిన సోహైల్‌ తెలుగు జనాల

Bigg Boss-4: తెలుగు జనాల మనుసులు గెలిచిన గోదావరిఖని కుర్రాడు.. ఇకనుంచి మటన్, చికెన్ కథ వేరేగా ఉంటది..

Updated on: Dec 21, 2020 | 5:33 PM

Bigg Boss-4: చికెన్​.. మటన్​.. చికెన్​.. మటన్​.. చికెన్​..మటన్​ అంటూ బిగ్​ బాస్​ హౌస్​లో సందడి చేసిన సోహైల్‌ తెలుగు జనాల మనుసులు గెలిచాడు. ఫైనల్​కు చేరి టాప్​–5లో మూడో స్థానంలో నిలిచిన సింగరేణి ముద్దుబిడ్డ ఈ సీజన్​లో అందరికంటే ఎక్కువ ఎంటర్​ టైన్​ చేశాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ గుర్తింపు లేకుండా హౌస్​లోకి వచ్చిన సోహైల్ ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో బిగ్​ సెలబ్రెటీ అయ్యాడు. తన క్యారెక్టర్​తో లక్షలాది ఫ్యాన్స్​ను సంపాదించుకున్నాడు.

మిడిల్​ క్లాస్​ ఫ్యామిలీ నుంచి బిగ్​బాస్​లోకి ఎంటర్​ కావడమే కష్టం. చిన్న ఆర్టిస్టు నుంచి ఏకంగా హౌస్​లోకి వచ్చి ఫైనల్​ దాక చేరడం, చిరు, నాగ్​లతో కలిసి స్క్రీన్​ పంచుకోవడం అతడికి లైఫ్​ లాంగ్​ గుర్తుండి పోయే అనుభవం. ఫినాలేలో విన్నర్​ అనౌన్స్​ అయ్యే దాక షో అంతా సొహెల్ చుట్టే తిరిగింది. దీన్ని బట్టే అర్థమవుతుంది అతడు కనెక్ట్​ అయినట్టు ఎవరూ కాలేదని.ఇక మెగాస్టార్ చిరంజీవి సోహైల్‌కు ఎంత ప్రియారిటీ ఇచ్చాడో అందరం చూశాం. ఏకంగా తనకోసం ఇంటి దగ్గరి నుంచి బిర్యానీయే తీసుకొచ్చాడంటే ఎంతగా ఆకట్టుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.

తన ఊతపదాలు సింగరేణి ముద్దుబిడ్డ, కథ, కర్ఖానా, కథ వేరే వుంటది ఇక్కడ ఇవన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సింగరేణి ముద్దుబిడ్డ అంటూ ఎప్పుడూ తన ఊరిపై మమకారాన్ని చాటాడు. హౌస్​ మేట్లకు స్నేహ హస్తాన్ని అందించాడు. జనాలను ఎంటర్​టైన్​ చేశాడు. స్టార్​ హీరోల అభిమానం చురగొన్నాడు. జీరోగా వెళ్లిన ఓ పట్టణ యువకుడు సెలబ్రిటీగా బయటకు వస్తున్నాడంటే అది గొప్ప విషయమే. బిగ్​ బాస్​ తెచ్చిన క్రేజ్​తో ఫ్యూచర్​ను పక్కా ప్లాన్​ చేసుకుని ముందుకు నడిస్తే సోహైల్ సింగరేణి నల్లనేలకు బంగారుబిడ్డ అవుతాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us