Shwetha Bachan Coments: వదినలో ఆ ఒక్క విషయం నచ్చదంటున్న శ్వేతా బచ్చన్.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన కామెంట్స్‌..

Shwetha Bachan Coments: తన వదినలో ఆ ఒక్క విషయం మాత్రం అస్సలు నచ్చదని చెబుతోంది బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్. ‘కాఫీ విత్ కరణ్’షోలో భాగంగా శ్వేతా

Shwetha Bachan Coments: వదినలో ఆ ఒక్క విషయం నచ్చదంటున్న శ్వేతా బచ్చన్.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన కామెంట్స్‌..

Updated on: Feb 03, 2021 | 9:41 PM

Shwetha Bachan Coments: తన వదినలో ఆ ఒక్క విషయం మాత్రం అస్సలు నచ్చదని చెబుతోంది బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్. ‘కాఫీ విత్ కరణ్’షోలో భాగంగా శ్వేతా బచ్చన్ తన అన్నా, వదినల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఐశ్వర్య రాయ్‌ను సెల్ఫ్ మేడ్ యాక్టర్, స్ట్రాంగ్ ఉమెన్, ఫెంటాస్టిక్ మదర్‌ అని కొనియాడిన శ్వేత.. టాలెంట్, హార్డ్ వర్క్ ఐశ్వర్యను సినిమా ఇండస్ట్రీలో గొప్పగా నిలబెట్టాయని తెలిపింది.

కానీ తనకు కాల్ చేసినా, మెసేజ్ చేసినా రెస్పాన్స్ ఇవ్వదని, వదినలో ఈ ఒక్క విషయం నచ్చదని తెలిపింది. ఇక అన్నయ్య కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత నిస్తాడని కొనియాడింది. తను ఫ్యామిలీని ఆరాధిస్తాడని, కుటుంబానికి అంకితమైపోతాడని తెలిపింది. కేవలం బెస్ట్ కొడుకు మాత్రమే కాదు, బెస్ట్ భర్త కూడా అని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. కానీ అన్నీ తనకే తెలుసని అనుకుంటాడని, ఆ విషయంలో అభిషేక్‌ను చూస్తే కోపమొస్తోందని చెప్పింది. మొత్తానికి శ్వేతా బచ్చన్ తన అన్నా, వదినలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

‘పదేళ్ల క్రితం బొద్దుగా ఉండేదాన్ని.. మద్యం తాగడం వల్లే బరువు పెరిగా’ అన్నారు.. అసలు నిజం చెబుతున్న హాట్ బ్యూటీ..