
యంగ్ హీరో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటేస్ట్ మూవీ భోగి. డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా పై ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం (నవంబర్ 27న) ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. ఇందులో డింపు్ హయాతి కీలకపాత్రలో నటించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రీమియర్ షోలు, మార్నింగ్ షోలు పూర్తి కావడంతో ఈ సినిమా ఎలా ఉందనే అభిప్రాయాన్ని అడియన్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. అయితే భోగి సినిమాపై ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకుందామా.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..
భోగి ఒక పూర్తిస్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. శర్వానంద్ తన హై-ఎనర్జీ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఈలలు, చప్పట్లు కొట్టిస్తాడు. ఎలివేషన్ సన్నివేశాలు, పంచి డైలాగులు, స్టైలిష్ ప్రెజెంటేషన్ ఈ సినిమాకు బలమైన కమర్షియల్ ఫ్లేవర్‌ను అందిస్తాయి. సంపత్ నంది ఎన్నో మాస్ మూమెంట్స్, వినోదాత్మక సన్నివేశాలతో సినిమాను ఉత్సాహంగా నడిపిస్తాడు. ముఖ్యంగా కమర్షియల్ సినిమా అభిమానుల కోసం, పెద్ద తెరపై చూడటానికి అనువుగా రూపొందించిన చిత్రం ఇది అంటూ తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..
ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.
ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..