షారూక్‌ని అట్లీ ఎలా చూపించబోతున్నారంటే!

బాలీవుడ్ కింగ్‌ఖాన్ షూరూక్ ఖాన్‌, కోలీవుడ్ హిట్‌ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు

షారూక్‌ని అట్లీ ఎలా చూపించబోతున్నారంటే!
TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 03, 2020 | 10:03 PM

Shah Rukh Khan movie: బాలీవుడ్ కింగ్‌ఖాన్ షూరూక్ ఖాన్‌, కోలీవుడ్ హిట్‌ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన రాకపోవడంతో.. ఈ ప్రాజెక్ట్ ఉందో..? లేదో..? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాదిలో ఈ కాంబోలో చిత్రం సెట్స మీదకు వెళ్లనుంది.

అంతేకాదు ఇందులో షారూక్ రా ఏజెంట్‌గా కనిపించబోతున్నారని సమాచారం. ఇక కథానుగుణంగా పలు దేశాల్లో ఈ మూవీ షూటింగ్ జరగనుందని.. కార్ ఛేజింగ్‌లతో పాటు యాక్షన్ సీన్లు హై లెవల్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీని షారూన్‌నే నిర్మించబోతున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Read More:

గంగూలీ సహా పలువురి బయోపిక్‌లో నటించాలనుకున్న సుశాంత్

7 నుంచి హైదరాబాద్ మెట్రో సర్వీసులు.. మార్గదర్శకాలివే

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu