Samantha Birthday: యూటర్న్, ఓ బేబీ వంటి వంటి సక్సెస్ఫుల్ చిత్రాలతో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ సత్తాచాటగలనని నిరూపించుకుంది స్టార్ హీరోయిన్ సమంత (Samantha). అందుకే ఒకవైపు గ్లామర్ పాత్రలు పోషిస్తూనే మరోవైపు మహిళా ప్రాధాన్య చిత్రాలకు సై అంటోంది అందాల తార. ఈక్రమంలోనే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం (Shaakuntalam) అనే పౌరాణిక సినిమాలో మెయిన్ రోల్లో నటిస్తోంది సామ్. ఆమె కెరీర్ లోనే ఇది బిగ్ బడ్జెట్ సినిమా కావడం విశేషం. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సామ్ లుక్కు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా సమంత పుట్టిన రోజును పురస్కరించుకుని అభిమానులకు మరో ట్రీట్ ఇచ్చింది చిత్రబృందం. సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసి సామ్‌కి బర్త్ డే విషెస్ తెలిపింది. ప్రస్తుతం ఈ న్యూ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక శాకుంతలం కొత్త పోస్టర్ లో పాలరాతి శిల్పంలా ఎంతో అందంగా కనిపించింది సామ్. నిజంగానే దేవకన్య దిగివచ్చింది అనేలా మెరిసిపోయింది. ఇక ఈ సినిమాతో పాటు యశోద అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది సామ్. అదేవిధంగా ఫ్యామిలీ మ్యాన్2 తర్వాత బాలీవుడ్‌లోనూ బిజీగా మారింది. ఈక్రమంలోనే వరుణ్ ధావన్‌తో కలిసి ఓ యాక్షన్ వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. ఇటీవల విజయ్‌దేవర కొండతో కలిసి శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Wishing the ethereal “Shakuntala” from #Shaakuntalam @Samanthaprabhu2 a very Happy Birthday! #HBDSamantha #MythologyforMilennials #EpicLoveStory pic.twitter.com/NZPvGdCVLY
— Gunasekhar (@Gunasekhar1) April 28, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
India Coronavirus: ఫోర్త్ వేవ్ అలర్ట్.. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. నిన్న ఎన్నంటే..