Actress Rohini: రఘువరన్ చనిపోయాక సాయం అడిగింది ఆ ఒక్క హీరోనే.. ఫోన్ చేయగానే ఏమన్నారంటే.. నటి రోహిణి..

దక్షిణాది చిత్రసీమలో విలక్షణమైన నటన, ప్రత్యేకమైన వాయిస్ మాడ్యులేషన్, హుందాతనంతో తనకంటూ చెరగని ముద్ర వేసిన నటుడు రఘువరన్. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి సుమారు 150 నుంచి 200 సినిమాలకు పైగా నటించి ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు. కేవలం ప్రతినాయకుడిగానే కాకుండా, భావోద్వేగాలతో కూడిన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కథానాయకుడిగా కూడా వైవిధ్యమైన పాత్రలు పోషించారు.

Actress Rohini: రఘువరన్ చనిపోయాక సాయం అడిగింది ఆ ఒక్క హీరోనే.. ఫోన్ చేయగానే ఏమన్నారంటే.. నటి రోహిణి..
Rohini

Updated on: Nov 29, 2026 | 8:24 AM

దక్షిణాది సినిమాల్లో తన విలక్షణ నటన, గాంభీర్యమైన గొంతుతో ప్రత్యేక ముద్ర వేసిన దివంగత నటుడు రఘువరన్. విలన్ పాత్రలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం, సంగీతంపై ఆయనకున్న మక్కువ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రఘువరన్ మరణానంతరం ఆయన రూపొందించిన సంగీత ఆల్బమ్‌ను విడుదల చేసేందుకు సూపర్‌స్టార్ రజనీకాంత్ సహాయం కోరిన సందర్భాన్ని, అలాగే తన కుమారుడు రిషి గురించి నటి రోహిణి పంచుకున్న విశేషాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. సినిమాల్లో నటుడిగా స్థిరపడకముందే రఘువరన్‌కు సంగీతంతో విడదీయరాని అనుబంధం ఉందని రోహిణి తెలిపారు. కోయంబత్తూరులో ఉన్నప్పటి నుంచే ఆయనకు ఓ మ్యూజిక్ బ్యాండ్ ఉండేదని, చెన్నైకి వచ్చిన తర్వాత కూడా గిటార్ వాయించేవారని గుర్తుచేసుకున్నారు. ధనరాజ్ మాస్టర్ వద్ద రఘువరన్, ఇళయరాజా ఒకే గురువు దగ్గర గిటార్ నేర్చుకున్న విషయాన్ని ప్రస్తావించారు. అప్పట్లో కొందరు సంగీత కళాకారులకు రోజుకు రూ. 200 చొప్పున ఇచ్చేవారని, రఘువరన్ కూడా కొన్ని సినిమాలకు వాయించారని, సంగీతమే ఆయన ప్రాణమని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..

జీవిత చివరి దశలో రఘువరన్ స్వయంగా కొన్ని పాటలు రాసి, పాడి, ఇంట్లోనే రికార్డ్ చేశారని రోహిణి వెల్లడించారు. ఒక ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆల్బమ్ రూపొందించాలనేది ఆయన ఆశయమని, స్టూడియోలో లైవ్‌గా మరింత మెరుగులు దిద్దాలనుకున్నప్పటికీ ఆయన ఆకస్మికంగా మరణించడంతో ఆ ప్రాజెక్ట్ అసంపూర్తిగా మిగిలిపోయిందని చెప్పారు. ఆయన వద్ద ఉన్న ఆ రఫ్ ట్రాక్స్‌ను అలాగే ఉంచకుండా, రఘువరన్ అభిమానుల కోసం విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆ ఆల్బమ్ విడుదలకు రజనీకాంత్ అయితే సరైన వ్యక్తి అని భావించి, ఆయనతో ఉన్న సాన్నిహిత్యం మేరకు సాయం అడిగారట. అడిగిన వెంటనే మరుసటి రోజే రజనీకాంత్ అపాయింట్‌మెంట్ ఇచ్చారని, ఆ ఆల్బమ్‌ను విడుదల చేసినట్లు రోహిణి గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..

ఈ ఆల్బమ్ విడుదల కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలని తన కుమారుడు రిషిని కోరినట్లు రోహిణి చెప్పారు. రిషికి పబ్లిసిటీ అంటే అస్సలు ఇష్టం ఉండదని, బయటకు వెళ్లినప్పుడు గుర్తుపట్టి ఫోటోలు తీయడం వంటి అటెన్షన్ అతనికి వద్దని తెలిపారు. అతని ప్రైవసీని తాను ఎప్పుడూ గౌరవిస్తానని, కానీ ఇది రఘువరన్‌కు సంబంధించిన విషయం కావడంతో తప్పకుండా రావాలని అడగగా, ఆ వేడుకకు వచ్చాడని రోహిణి వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

Loading...
Unable to load recommendations.
Follow Us