రాక్‌స్టార్ ఇది నిజమేనా..?

| Edited By:

Dec 12, 2019 | 7:50 PM

రాక్‌స్టార్ అలియాస్ దేవీ శ్రీ ప్రసాద్ అలియాస్ డీఎస్పీ.. ఈ పేరులో ఓ మ్యాజిక్ ఉంది. ఆయన పాటలు వింటే చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి ఊపు రావడం ఖాయం. గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్‌లో నంబర్ 1గా కొనసాగుతున్న ఈ సంగీత దర్శకుడికి ప్రేక్షకుల నాడి బాగా తెలుసు. ఈ నేపథ్యంలో ఆయనకు ఇప్పుడు బంపరాఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా టాలీవుడ్, కోలీవుడ్ కాదు బాలీవుడ్‌లో ఓ పెద్ద […]

రాక్‌స్టార్ ఇది నిజమేనా..?
Follow us on

రాక్‌స్టార్ అలియాస్ దేవీ శ్రీ ప్రసాద్ అలియాస్ డీఎస్పీ.. ఈ పేరులో ఓ మ్యాజిక్ ఉంది. ఆయన పాటలు వింటే చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి ఊపు రావడం ఖాయం. గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్‌లో నంబర్ 1గా కొనసాగుతున్న ఈ సంగీత దర్శకుడికి ప్రేక్షకుల నాడి బాగా తెలుసు. ఈ నేపథ్యంలో ఆయనకు ఇప్పుడు బంపరాఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా టాలీవుడ్, కోలీవుడ్ కాదు బాలీవుడ్‌లో ఓ పెద్ద నిర్మాణ సంస్థ నుంచి డీఎస్పీకి కాల్ వచ్చినట్లు టాక్.

రణ్‌వీర్ సింగ్, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా ప్రముఖ యశ్‌రాజ్ సంస్థ జయేష్ భాయి జోర్దార్ అనే సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో రణ్‌వీర్ సింగ్ గుజరాతీగా కనిపించనుండగా… దివ్యాంగ్ టక్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్ పేరు వినిపిస్తోంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ రాక్‌స్టార్‌తో సంప్రదింపులు జరిపిందని, ఆయన ఓకే చెప్పారని సమాచారం. అంతేకాదు దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్.

అయితే కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్‌, కోలీవుడ్‌‌లో దాదాపుగా స్టార్ హీరోలందరితో దేవీ కలిసి పనిచేశాడు. ఇక బాలీవుడ్‌లోనూ ఆయన పాటలు వినిపించాయి. ముఖ్యంగా ఆర్య 2లో ఫేమస్ అయిన రింగ రింగ పాటను బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఢీంక చక.. ఢీంక చక పేరుతో రీమేక్ చేయించుకున్నాడు. అంతేకాదు డీఎస్పీ ప్రతిభను గుర్తించిన సల్మాన్.. ఆయన నటించిన జయహో చిత్రంలో నాచ్‌రే అనే ఓ ప్రత్యేక పాటను అడిగి మరీ చేయించుకున్నాడు. అంతేకాదు దేవీ కంపోజ్ చేసిన ఆ అంటే అమలాపురం.. ఆకలేస్తే అన్నం పెడతా సాంగ్‌లు కూడా బాలీవుడ్‌లో రీమేక్ అయ్యాయి. ఇవన్నీ అక్కడ భారీ విజయాన్ని సాధించాయి. ఇక రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ జంజీర్‌కు కూడా మ్యూజిక్ డైరక్టర్‌గా దేవీ పేరునే వినిపించినప్పటికీ.. కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్‌ను వదులుకున్నాడు దేవీ. వీటితో పాటు పలు సినిమాల్లో కొన్ని పాటలను చేసేందుకు కూడా ఆయనను సంప్రదించారని.. కానీ సినిమా మొత్తం తాను చేసేందుకు ఆసక్తిని చూపే దేవీ, వాటిని వదులుకున్నాడని అప్పట్లో టాక్ వినిపించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు జయేష్ భాయి జోర్దార్‌ సినిమాపై దేవీ గురించి అధికారిక ప్రకటన వస్తే.. బాలీవుడ్‌లో ఆయన చేయబోయే మొదటి చిత్రం ఇదే అవుతుంది.