Rashi Khanna gym look: ఆన్ స్క్రీన్ గ్లామర్ షో చేసే హీరోయిన్లు చాలా మందే ఉంటారు. కానీ ఆఫ్ స్క్రీన్ కూడా సెగలు రేపే అందాల భామల లిస్ట్ కాస్త తక్కువే.. టాలీవుడ్ లో అలాంటి బ్యూటీస్ మరి తక్కువ. ఆ షార్ట్ లిస్ట్‌లోనే ఉంటారు హాట్ బ్యూటీ రాశీ ఖన్నా. ఒకప్పుడు బొద్దుగుమ్మగా అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు స్లిమ్ లుక్‌లో సెక్సీ ఫోజులిస్తున్నారు.
ముఖ్యంగా ఈ బ్యూటీ జిమ్ లుక్స్ ఓ రేంజ్‌లో వైరలవుతున్నాయి. అమ్మడి అందాల కోసమే ఆ డ్రెస్ డిజైన్ చేశారా? అనేంత పర్ఫెక్ట్ స్టైలింగ్‌ను ఫాలో అవుతుంటారు రాశీ ఖన్నా. జిమ్‌కి వెళ్లేప్పుడు నడుమందాలు చూపిస్తూ అమ్మడు చేసే హాట్ షోకు ఓ రేంజ్‌లో ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా పట్టించుకోకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోతోంది.
రీసెంట్‌గా జిమ్‌కి వెళుతూ కెమెరాలకు చిక్కారు రాశి. అయితే ఈ ఫోటోలలో అమ్మడి స్టైలింగ్ చూసి అవాక్కవుతున్నారు ఫ్యాన్స్. ఎంత సన్నజాజి నడుము అయితే మాత్రం షర్ట్ పైకి ఫోల్డ్ చేసి మరీ చూపించాలా.. అంటూ డైరెక్ట్‌గానే కామెంట్లు పేలుస్తున్నారు. అయినా ఎవరి స్టైల్ వాళ్లది లెండీ..!