Ram Pothineni : నా స్నేహితులు వాళ్లే.. నాకు ఆరెండు తప్ప ఏం తెలియదు.. ఆసక్తికర విషయాలు తెలిపిన హీరో రామ్

యంగ్ హీరో రామ్ రెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు.

Ram Pothineni : నా స్నేహితులు వాళ్లే.. నాకు ఆరెండు తప్ప ఏం తెలియదు.. ఆసక్తికర విషయాలు తెలిపిన హీరో రామ్

Edited By:

Updated on: Jan 16, 2021 | 12:28 PM

యంగ్ హీరో రామ్ రెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు ఈ కుర్ర హీరో. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు రామ్.

రామ్ మాట్లాడుతూ..  ఇల్లు షూటింగ్ ఈ రెండే నాకు తెలిసినవి, బయట పార్టీలకు కూడా ఎక్కువగా వెళ్ళాను, అమ్మతో చాలా సన్నిహితంగా ఉంటా.. అన్నీషేర్‌ చేసుకుంటా అని చెప్పుకొచ్చాడు. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ..” నేను సింగిల్. ఇంట్లో పెళ్లి గురించి అడిగారు అంతే.. నా తత్వం గురించి వాళ్లకు తెలుసు అందుకే పెళ్లి విషయంలో నన్ను ఒత్తిడి చేయలేదు అని తెలిపాడు.  ఇక తన ఫ్రెండ్ గురించి చెప్తూ.. తనకు రెండో తరగతిలో ఉన్న స్నేహితులే ఇప్పటికీ ఉన్నారని తెలిపాడు. ఇండస్ట్రీలో బాలీవుడ్ హీరో రితీష్ దేశముఖ్ అతడి భార్య హీరోయిన్ జెలీనియా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌. ముంబయికి వెళ్లినప్పుడు వాళ్లను కలుస్తా. వాళ్లు హైదరాబాద్‌ వస్తే మా ఇంటికి వస్తారు అని చెప్పుకొచ్చాడు రామ్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Actress Kriti Sanon : మహేష్ హీరోయిన్ కవితకు ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్‌‌‌‌గా మారిన కృతిసనన్ పోస్ట్

 

Loading...
Unable to load recommendations.
Follow Us