వర్మ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ బయోపిక్‌..!

షూటింగ్‌లకు అనుమతి ఇచ్చినప్పటికీ.. కరోనా భయంతో సెట్స్ మీదకు వెళ్లేందుకు ఇంకా ఆలోచిస్తున్నారు స్టార్ నటీనటులు, దర్శకులు. అయితే రామ్ గోపాల్‌ వర్మ మాత్రం అందరికి విభిన్నంగా పనిచేస్తున్నారు.

వర్మ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ బయోపిక్‌..!

Updated on: Jul 25, 2020 | 3:08 PM

షూటింగ్‌లకు అనుమతి ఇచ్చినప్పటికీ.. కరోనా భయంతో సెట్స్ మీదకు వెళ్లేందుకు ఇంకా ఆలోచిస్తున్నారు స్టార్ నటీనటులు, దర్శకులు. అయితే రామ్ గోపాల్‌ వర్మ మాత్రం అందరికి విభిన్నంగా పనిచేస్తున్నారు. ఒకదాని తరువాత మరొకటి సినిమాలు తీసుకుంటూ పోతూ వాటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు సినిమాలను ఆయన రిలీజ్ చేయగా.. మరో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఎప్పుడూ వివాదాస్పద అంశాలనే కథలుగా ఎంచుకునే వర్మ.. ఇప్పుడు ఉదయ్ కిరణ్‌ కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకొని మరణించిన ఉదయ్ కిరణ్‌ బయోపిక్‌ను వర్మ తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో మెగా ఫ్యామిలీని మరోసారి టార్గెట్ చేయబోతున్నట్లు టాక్‌. అంతేకాదు ప్రస్తుతం ఉదయ్ కిరణ్‌లా కనిపించే వ్యక్తి కోసం వర్మ గాలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Loading...
Unable to load recommendations.
Follow Us