
పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ సతీమణి ప్రముఖ వ్యాపారవేత్త , అపోలో లైఫ్ వైస్-చైర్పర్సన్ ఉపాసనా కొణిదెల, ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలోని వివిధ అంశాలపై తన ఆలోచనలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె వ్యక్తిగత సంబంధాల గురించి, నాయకత్వ శైలి గురించి, సమాజంలోని మూస ధోరణుల గురించి చెప్పుకొచ్చారు. ఉపాసన తన సమకాలీనులైన మహిళలపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా, నటి సమంత రూత్ ప్రభును తన స్ఫూర్తిగా పేర్కొన్నారు. “నేను నిజంగానే ఆమె నుండి నేర్చుకుంటున్నాను. ఆమె కంటెంట్ చదవడం, ఆమె వ్యక్తిత్వాన్ని ఇంకా అర్థం చేసుకోవడం… ఆమె ఒక పనికి ఎంతలా కట్టుబడి ఉంటుందో, అదంతా సూపర్బ్” అని ఉపాసన అన్నారు. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను “నా బడ్డీ” అని పిలుస్తూ, ఆమె నెక్స్ట్ లెవెల్ అని, తనంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. “సిల్వర్ స్పూన్”తో పుట్టిన వారికి జీవితం సులభంగా ఉంటుందని చాలా మంది అనుకుంటారని, కానీ అది నిజం కాదని ఉపాసన అన్నారు. ప్రతీ ఒక్కరి జీవితంలోనూ సవాళ్లు ఉంటాయని, ఎవరి సమస్యలూ పెద్దవి లేదా చిన్నవి కావని, ఒకరి సమస్యలను మరొకరు గౌరవించాలని సూచించారు.
ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..
జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి ఉపాసన మాట్లాడుతూ, ఆమె చాలా స్వీట్, స్ట్రాంగ్ అని అన్నారు. “నేను ఇంట్లో లేనప్పుడు కూడా నా ఇంటిని చూసుకునే వ్యక్తి. ఆమె చాలా స్వీట్. ప్రణతిని చూసినప్పుడు, అన్నింటినీ చూసుకోగల ఒక అద్భుతమైన అమ్మాయి కనిపిస్తుంది. ఆమె అందరికన్నా స్ట్రాంగ్. ఆమె నాకన్నా చాలా చిన్నది, కానీ చాలా స్ట్రాంగ్. ఆమె చాలా స్వీట్. ఆమెను చూస్తే మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాంటి అమ్మాయి. తారక్ ఆమెను పొందడం చాలా అదృష్టం” అని ఉపాసన ప్రణతిపై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. నమ్రతా శిరోద్కర్ తనకు సినీ పరిశ్రమ గురించి ఎన్నో విషయాలు నేర్పించారని, నిర్మాతలకు, దర్శకులకు సంబంధించిన విషయాలు తెలియని సమయంలో ఆమెనే తనకు మార్గదర్శకత్వం వహించారని వెల్లడించారు. మహేష్ బాబు కుమార్తె సితారా ఘట్టమనేనితో తనకున్న ప్రత్యేక బంధాన్ని కూడా ఉపాసన పంచుకున్నారు, వారిద్దరి పుట్టినరోజు ఒకే రోజు కావడం విశేషం.
ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.
తన నాయకత్వ శైలి గురించి మాట్లాడుతూ, ఉపాసన తాను “బాస్” కాదని, కానీ తన సంస్థను నాయకత్వ స్ఫూర్తితో నడిపిస్తానని స్పష్టం చేశారు. దీనికోసం తాను ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుంటానని, నాయకత్వ లక్షణాల గురించి నిరంతరం చదువుతూ, నేర్చుకుంటానని తెలిపారు. తన తల్లిదండ్రులు, కుటుంబం నుంచే నాయకత్వ గుణాలను అలవర్చుకున్నానని చెప్పారు. తన అంతరాత్మ, లక్ష్యం, మిషన్ స్పష్టంగా ఉన్నాయని, తనతో పనిచేసేవారు ప్రేరణతో, ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటానని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..
Upasana, Jr Ntr
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..