Rajeev Kanakala : ఒక్క సినిమాతో అతడు సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఏలేశాడు.. రాజీవ్ కనకాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

హిందీ పరిశ్రమలో గుర్తింపు కోసం ఎదురుచూసిన ఒక నటుడు.. తెలుగులో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాతో లైఫ్ మారిపోయిందని నటుడు రాజీవ్ కనకాల అన్నారు. ఆ తర్వాత అతడు సౌత్ ఇండస్ట్రీని ఏలేశారని నటుడు రాజీవ్ కనకాల గుర్తుచేసుకున్నారు. భాషా సమస్యలున్నా ప్రతి చిన్న హావభావాన్ని ప్రత్యక్షంగా చేసి చూపిస్తూ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి నటించిన తీరు ప్రదీప్ కెరీర్‌కు ఎంతో ఉపయోగపడిందని ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

Rajeev Kanakala : ఒక్క సినిమాతో అతడు సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఏలేశాడు.. రాజీవ్ కనకాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Rajeev Kanakala

Updated on: Nov 28, 2026 | 7:08 AM

దక్షిణాది సినిమాల్లో విలన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రదీప్ రావత్ ప్రస్థానంపై నటుడు రాజీవ్ కనకాల పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఒక్క సినిమా తర్వాత ప్రదీప్ రావత్ దక్షిణాది పరిశ్రమలో విలన్‌గా తిరుగులేని స్థాయికి ఎదిగారని, నిజంగానే ఇండస్ట్రీని ఏలేశారని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. ప్రదీప్ రావత్ కెరీర్‌లో వచ్చిన కీలక మలుపును గుర్తుచేసుకుంటూ, హిందీ పరిశ్రమలో అంతకుముందు ఆయన ఎదుర్కొన్న పరిస్థితులను రాజీవ్ కనకాల వివరించారు. ఎన్నో ఏళ్లుగా హిందీ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదని, మంచి పాత్రలు లభించలేదని, చిన్నచిన్న డైలాగులు మాత్రమే వచ్చేవని ప్రదీప్ రావత్ తనతో చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు. అయితే దక్షిణాదిలో వచ్చిన సై సినిమా పెద్ద హిట్ కావడం.. ఆ ఒక్క సినిమాతో ఆయన పేరు మారుమోగిపోయిందని, సౌత్ ఇండస్ట్రీలో ప్రదీప్ రావత్ ఓ ఊపు ఊపారని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..

భాషాపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పనితీరు నటులకు ఎంతగానో ఉపయోగపడుతుందని రాజీవ్ కనకాల పేర్కొన్నారు. మనకు తెలుగు లేదా హిందీ భాష తెలిస్తే ఒకసారి చెప్పగానే అర్థం చేసుకుని చేయగలం కానీ, వేరే భాషా నేపథ్యం ఉన్నవారికి కొన్నిసార్లు అంత సులభం కాదని అన్నారు. అలాంటి సమయంలో రాజమౌళి ప్రతి చిన్న విషయాన్ని కూడా స్పష్టంగా వివరిస్తారని తెలిపారు. నటుడికి తగిన ఇన్‌పుట్ ఇస్తే నటించడం చాలా సులభమవుతుందని, ఒక్కోసారి షాట్ సరిగ్గా రాకపోతే రాజమౌళి స్వయంగా చేసి చూపిస్తారని రాజీవ్ వివరించారు. కనుబొమ్మలు ఎలా ముడవాలి, ఎప్పుడు తిరగాలి, ఏ టైమింగ్‌లో రియాక్ట్ అవ్వాలనే అంశాలను కూడా ప్రత్యక్షంగా చేసి చూపిస్తూ నటుల నుంచి తనకు కావాల్సిన అవుట్‌పుట్ తీసుకుంటారని రాజీవ్ అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..

విధంగా తీర్చిదిద్దిన సన్నివేశాలు, నేర్చుకున్న మెళకువలు ప్రదీప్ రావత్ తదుపరి కెరీర్‌లో కూడా ఎంతో ఉపయోగపడ్డాయని రాజీవ్ కనకాల తెలిపారు. ఆరంభంలో ఎదురైన సవాళ్లను అధిగమించి, సౌత్ సినిమాలో విలన్ పాత్రలకు కొత్త బలం చేకూర్చిన ప్రదీప్ రావత్ ప్రయాణంపై పంచుకున్న ఈ జ్ఞాపకాలు ఇప్పుడు వైరలవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.

 

ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..

Loading...
Unable to load recommendations.
Follow Us