
టాలీవుడ్‌తో పాటు వరల్డ్ వైడ్ సినీఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడికల్ ఫిక్షన్ యాంటర్టైనర్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్, శ్రియాశరణ్, అజయ్‌దేవ్‌గణ్, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 25న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతోంది ఆర్ఆర్ఆర్ చిత్రబృందం. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. సోమవారం(మార్చి21) పంజాబ్‌లో పర్యటించిన జక్కన్న, చెర్రీ, ఎన్టీఆర్ ప్రముఖ గోల్డెన్ టెంపుల్లో ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహించారు. ఇక ఈరోజు ఈ ఉదయం కోల్ కతాలో ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న వీరు మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అనంతరం సాయంత్రానికి ఉత్తర ప్రదేశ్‌లోని పవిత్ర నగరం వారణాసి (Varanasi)కి చేరుకున్నారు.
ఆధ్యాత్మిక వాతావరణంలో..
ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తులు ధరించిన రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ వారణాసిలో పవిత్ర గంగానదికి ప్రత్యేక పూజలు చేశారు. మెడలో రుద్రాక్ష, నుదుటున బొట్టు ధరించి పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. కాగా సుమారు రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికే రూ.1000కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో ఈ సినిమా రూ.2500 నుంచి రూ.3000 కోట్లు వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తొలి ఆటకే RRRను చూడాలని ఇటు మెగా ఫ్యాన్స్..అటు నందమూరి ఫ్యాన్స్ పోటీలు పడుతున్నారు.
Also Read: Viral Video: అయ్యో అయ్యో అయ్యయ్యో.. బుడ్డోడికి ఎన్ని కష్టాలోచ్చాయో..! ఫన్నీ వీడియో వైరల్
Tamil Nadu: కండలు చూపి కవ్వించాడు.. చివరకు కటకటాల పాలయ్యాడు.. వీడి వేశాలు తెలిస్తే అవాక్కవుతారు..!