
టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినీ ప్రయాణం, స్టార్ హీరోలతో తనకున్న అనుబంధం గురించి అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తో తమకు ఉన్న బాండింగ్ గురించి చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనను తారక్ అన్న అని పిలుస్తారని, అయితే తాను మాత్రం ఎన్టీఆర్‌ను ముద్దుగా నాన్న అని పిలుస్తానని చెప్పారు. ఇప్పుడు దిల్ రాజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో అభిమానుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌తో తన సాన్నిహిత్యం ఎలా ఏర్పడిందనే విషయాన్ని వివరిస్తూ, తాను ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : చిన్ననాటి నుంచే ప్రాణ స్నేహితులు.. ఒకరు రాజకీయాల్లో సెన్సేషన్.. మరొకరు పెద్ద హీరో..
ముఖ్యంగా బృందావనం సినిమా షూటింగ్ సమయంలో తారక్‌తో మరింత చనువు పెరిగిందని చెప్పారు. ఆ సమయంలో కొడాలి నానితో పాటు ఇతర సన్నిహితులు ఎన్టీఆర్‌తో కలిసి ఉండేవారని, వారందరూ తారక్‌ను నాన్న అని పిలుస్తుండటం చూసి తనకు కూడా ఆ పిలుపు ఎంతో ముద్దుగా, ఆత్మీయంగా అనిపించిందని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒకే పాటను 2 సినిమాల్లో పెట్టారు.. ఆ సాంగ్ కోసమే థియేటర్లకు వచ్చిన జనాలు..
ఇతరులు పిలుస్తున్న ఆ పిలుపు తనకూ నచ్చడంతో, తనకు కూడా ఆ అవకాశం ఉందనే చనువుతో అప్పటి నుంచే ఎన్టీఆర్‌ను నాన్న అని పిలవడం కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. పరస్పర గౌరవం, ఆప్యాయతతో సాగే ఈ బంధంలో తారక్ తనను అన్న అని పిలుస్తారని, తాను మాత్రం తారక్‌ను నాన్న అని సంబోధిస్తానని సరదాగా పంచుకున్నారు. ప్రస్తుతం దిల్ రాజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ఇప్పుడు డ్రాగన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : పెద్ద హీరోయిన్ అని నాకు తెలియదు.. బయట నిలబడిన అమ్మాయికి పిలిచి ఛాన్స్ ఇచ్చా.
Dil Raju, Jrntr
ఎక్కువ మంది చదివినవి: Trending Song: ఏముంటది భయ్యా ఈ పాట.. ఇప్పట్లో ఇలాంటి సాంగ్ ఎప్పటికీ రాదు.. 26 ఏళ్లైనా తగ్గని క్రేజ్..