ఆ వార్తలపై ప్రియాంక ఫైర్..!

|

Apr 02, 2019 | 9:15 PM

అమెరికా: ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడాకులు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారని ఓ పత్రిక చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పెళ్లి చేసుకుని ఆరు నెలలు కాలేదు.. అప్పుడే విడాకులు ఏంటని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఇకపోతే ప్రియాంక ఇతరులను అదుపు చెయ్యాలని చూస్తుందని.. త్వరగా కోపం తెచ్చుకునే స్వభావం ఆమెదని.. ఇదే విడాకులకు ముఖ్య కారణం అంటూ ప్రముఖ మ్యాగజైన్ ఓ కథనం ప్రచురించింది. అయితే తాజాగా ఈ వార్త రాసిన […]

ఆ వార్తలపై ప్రియాంక ఫైర్..!
Follow us on

అమెరికా: ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడాకులు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారని ఓ పత్రిక చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పెళ్లి చేసుకుని ఆరు నెలలు కాలేదు.. అప్పుడే విడాకులు ఏంటని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఇకపోతే ప్రియాంక ఇతరులను అదుపు చెయ్యాలని చూస్తుందని.. త్వరగా కోపం తెచ్చుకునే స్వభావం ఆమెదని.. ఇదే విడాకులకు ముఖ్య కారణం అంటూ ప్రముఖ మ్యాగజైన్ ఓ కథనం ప్రచురించింది.

అయితే తాజాగా ఈ వార్త రాసిన సదరు మ్యాగజైన్ పత్రికపై ప్రియాంక, నిక్ లు ఆగ్రహం వ్యక్తం చేశారట. అంతేకాదు ఆ మీడియా మీద కోర్టుకు ఎక్కాలని చూస్తున్నారట. తాము విడాకులు తీసుకున్నట్లు తప్పుడు వార్తలు ప్రచురించిన ఆ మ్యాగజైన్ మీద దావాకు రెడీ అయ్యారని సమాచారం.