కోపంతో భర్తను కారు నుంచి దింపేసిన ప్రియాంక చోప్రా.. వీధుల్లో గొడవపడిన జంట.. అసలు కారణం ఏంటీ?..

బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ హీరో నిక్‏జోనాస్‏ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్‏లో క్వాంటికో సిరీస్‏లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ప్రియాంక.

కోపంతో భర్తను కారు నుంచి దింపేసిన ప్రియాంక చోప్రా.. వీధుల్లో గొడవపడిన జంట.. అసలు కారణం ఏంటీ?..
Follow us

|

Updated on: Dec 16, 2020 | 7:36 PM

బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ హీరో నిక్‏జోనాస్‏ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్‏లో క్వాంటికో సిరీస్‏లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ప్రియాంక. అదే సమయంలో తనకంటే పదేళ్ళు చిన్నవాడైన నిక్‏జోనాస్‏ను 2018లో ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.

కాగా, తన భర్త నిక్‏పై ప్రియాంకకు కోపం వచ్చింది. దీంతో లండన్ వీధుల్లో వీరిద్దరి మధ్య మాటలయుద్ధం జరిగింది. అంతే వెంటనే తన భర్తను కారులో నుంచి దిగిపొమ్మని గట్టిగా చెప్పింది ప్రియాంక. అయితే ప్రియాంక తన భర్తతో గొడపడింది రియల్ లైఫ్‏లో కాదండోయ్ రీల్ లైఫ్‏లో ఇదంతా జరిగింది. ప్రస్తుతం ప్రియాంక్ తన కొత్త సినిమా ‘టెక్ట్స్ ఫర్ యూ’ షూటింగ్‏లో బిజీగా ఉన్నారు. ఈ మూవీలో ప్రియాంక భర్త నిక్‏జోనాస్‏ అతిథి పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా వీరిద్దరికీ సంబంధించిన కొన్ని సన్నివేశాలను లండన్‏లో చిత్రీకరించారు. అందులో భాగంగానే తనతోపాటు కారులో ప్రయాణిస్తున్న నిక్‏తో ప్రియాంక గొడవపడడం, ఆ తర్వాత నిక్‏ను తన కారు నుంచి దిగిపొమ్మని చెప్పడం.. ఇలాంటి కొన్ని సీన్లను చిత్రీకించారు.

Latest Articles