RadheShyam Movie Update: ప్రభాస్ అభిమానులకు గుడ్‏న్యూస్.. సూపర్బ్ ఫోటోతో టీజర్ అప్‏డేట్ ఇచ్చిన ‘రాధేశ్యామ్’..

|

Feb 12, 2021 | 9:46 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‏న్యూస్ వచ్చేసింది. రెబల్ స్టార్ నటిస్తోన్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’ టీజర్ విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్.

RadheShyam Movie Update: ప్రభాస్ అభిమానులకు గుడ్‏న్యూస్.. సూపర్బ్ ఫోటోతో టీజర్ అప్‏డేట్ ఇచ్చిన రాధేశ్యామ్..
Follow us on

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‏న్యూస్ వచ్చేసింది. రెబల్ స్టార్ నటిస్తోన్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’ టీజర్ విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‏పై ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్వకత్వంలో ఈ అందమైన ప్రేమకావ్యం తెరకెక్కుతుంది. ఈ సినిమా కొత్త పోస్టర్ షేర్ చేస్తూ ఫిబ్రవరి 14వ తేదీన ఉదయం 9.18 గంటలకు రాధేశ్యామ్ టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రేమికుల రోజు అభిమానులకు పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ప్రభాస్.

ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తైంది. ఏప్రిల్‌లో రాధేశ్యామ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రభాస్ 20వ సినిమాగా రాబోతున్న ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రి టీజర్‌ కూడా దుమ్మురేపుతోంది. 1960 దశకం నాటి వింటేజ్‌ లవ్ స్టోరీతో జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఫోటోలో ప్రభాస్ చేతులు జేబులో పెట్టుకోని తనదైన స్టైల్లో వాక్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ ఓ పెయింటింగ్‏ని తలపించేలా డిజైన్ చేశారు. తొందర్లోనే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించే ఛాన్స్ ఉంది. ‘రాధే శ్యామ్’ హిందీ వెర్షన్ కు సంబంధించి మిథున్ – మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. తెలుగుతోపాటు మిగిలిన దక్షిణాది భాషలకు మ్యూజిక్ సమకూర్చే బాధ్యతను జస్టిన్ ప్రభాకరన్‏కు అప్పగించారు.

Also Read:

సెట్స్‌పైకి వెళ్లనున్న చెస్ దిగ్గజం బయోపిక్.. ప్రధాన పాత్ర పోషించనున్న బాలీవుడ్ స్టార్ హీరో.!