Pawan Kalyan: పవన్‌ – తేజ్‌ మూవీ టైటిల్‌ వచ్చేసింది.. థమన్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు ‘బ్రో’ సూపర్ అసలు..

|

May 18, 2023 | 4:39 PM

పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, సాయి ధరమ తేజ్‌ కాంబినేషనల్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించిన ఈ సినిమా టైటిల్‌ను మాత్రం చిత్ర యూనిట్‌ విడుదుల చేయలేదు. అయితే తాజాగా గురువారం ఈ సినిమా టైటిల్‌ను రివీల్‌ చేస్తూ చిత్ర యూనిట్‌ ఓ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది...

Pawan Kalyan: పవన్‌ - తేజ్‌ మూవీ టైటిల్‌ వచ్చేసింది.. థమన్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు బ్రో సూపర్ అసలు..
BRO Movie
Follow us on

పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, సాయి ధరమ తేజ్‌ కాంబినేషనల్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించిన ఈ సినిమా టైటిల్‌ను మాత్రం చిత్ర యూనిట్‌ విడుదుల చేయలేదు. అయితే తాజాగా గురువారం ఈ సినిమా టైటిల్‌ను రివీల్‌ చేస్తూ చిత్ర యూనిట్‌ ఓ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాకు ‘బ్రో’ అనే పేరును ఖరారు చేశారు.

ఇక ‘బ్రో’ టైటిల్‌ పోస్టర్‌ మోషన్‌ వీడియో విషయానికొస్తే.. పవన్‌ సరికొత్త లుక్‌లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు సంగీతం అందిస్తోన్న థమన్‌ ఇచ్చిన బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అభిమానులకు బాగా నచ్చుతోంది. పవన్‌ పూర్తిగా స్లిమ్‌ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ సినిమాను తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘వినోదాయ సిథం’ అనే చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జులై 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇంతకీ ఈ సినిమా కథెంటంటే..

తమిళంలో తెరకెక్కిన ‘వినోదయ సిథం’ చిత్రానికి రీమేక్‌గా ‘బ్రో’ని తెరకెక్కిస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా కథేంటంటే.. కారు ప్రమాదంలో మరణించిన ఓ యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇస్తే ఎలాంటి పరిణామాలు జరిగాయన్న అంశాన్ని ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. బ్రో సినిమాలో యువకుడి పాత్రలో సాయి ధరమ్‌ తేజ్‌ నటిస్తుండగా.. దేవుడు పాత్రలో పవన్‌ కళ్యాణ్‌ నటించనున్నారు. మరి తమిళంలో విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..