Dekhte Reh Jaoge: జీ 5 ఓటిటి వేదికగా కొత్త ప్రచారం.. బ్రాండ్ అంబాసిడర్లుగా సారా అలీ ఖాన్ , అమోల్

Dekhte Reh Jaoge: వినోదం సరికొత్త వేదికగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో సిల్వర్ స్క్రీన్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగింది ఓటిటి...

Dekhte Reh Jaoge: జీ 5 ఓటిటి వేదికగా కొత్త ప్రచారం.. బ్రాండ్ అంబాసిడర్లుగా సారా అలీ ఖాన్ , అమోల్
Zee 5 Ott

Updated on: Jun 20, 2021 | 11:35 AM

Dekhte Reh Jaoge: వినోదం సరికొత్త వేదికగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో సిల్వర్ స్క్రీన్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగింది ఓటిటి. సూర్యవంటి స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల సినిమాల వరకూ లాక్ డౌన్ సమయంలో వినోదాన్ని పంచాయి. అయితే తాజాగా ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ జీ 5 సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు ఓటిటి ని తీసుకొస్తుంది.

‘దేఖే రెహ్‌ జాగోజీ’ పేరుతో సరికొత్త ప్రచారానికి శ్రీకారంచుట్టింది. ఆన్‌లైన్‌ వేదికగా ఈ ప్రచారం గురించి జీ–5 ఇండియా ప్రధాన అధికారి మనీష్‌ కల్రా వివరించారు. 18–34 ఏళ్లలోపు యువ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అపరిమిత వినోదం, వెబ్‌ సిరీస్, సినిమా, టీవీఎఫ్‌ షోలు, లైవ్‌తో 12కు పైగా భాషల్లో ఈ ప్రచారం సాగుతుందన్నారు.

ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు జీ 5 స్పెషల్ ప్రచారాన్ని నిర్వహిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్ , అమోల్ పరాషర్లను ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంది. ఇప్పటికే వీరిద్దరూ జీ 5 ఓటిటి లో ప్రసారమయ్యే కార్యక్రమాల గురించి తమదైన శైలీలో ప్రచారం నిర్వహిస్తున్నారు

Also Read: పోలీసులకు సేవలందిస్తున్న స్నిఫర్ డాగ్ మృతి.. శ్రద్ధాంజలి ఘటించిన తోటి కుక్కలు.. ఫోటో వైరల్

Loading...
Unable to load recommendations.
Follow Us