The Family Man: ఫ్యామిలీ మ్యాన్ స్ట్రీమింగ్‌పై మ‌రో అప్‌డేట్‌.. ఈసారైనా విడుద‌ల అవుతుందా..?

The Family Man: మ‌నోజ్ బాజ్ పాయ్, ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర దారుల్లో తెర‌కెక్కిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగుతో పాటు ప‌లు...

The Family Man: ఫ్యామిలీ మ్యాన్ స్ట్రీమింగ్‌పై మ‌రో అప్‌డేట్‌.. ఈసారైనా విడుద‌ల అవుతుందా..?
Th Family Man 2

Updated on: May 06, 2021 | 6:07 AM

The Family Man: మ‌నోజ్ బాజ్ పాయ్, ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర దారుల్లో తెర‌కెక్కిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగుతో పాటు ప‌లు భారతీయ భాష‌ల్లో విడుద‌లైన ఈ వెబ్‌సిరీస్ ప్రేక్ష‌కులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. టెర్ర‌రిజం నేప‌థ్యంలో అమేజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన ఈ సిరీస్ మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా ది ఫ్యామిలీ మ్యాన్‌2 తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే.
ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ మొద‌టి వారంలో విడుద‌ల కానున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ సిరీస్ విడుద‌ల ఇప్ప‌టికే ప‌లుసార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. నిజానికి గతంలోనే విడుద‌ల అవుతున్న‌ట్లు తేదీలు కూడా ప్ర‌క‌టించారు. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల స్ట్రీమింగ్ వాయిదా ప‌డింది. మ‌రి ఈ సారైనా విడుద‌లవుతుందో లేదో తెలియాంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాలి. ఇక రెండ‌వ సీజ‌న్‌లో స‌మంత న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. సామ్ ఇందులో డీగ్లామ‌ర్‌లో రోల్‌లో ఒక ఉగ్ర‌వాది పాత్ర‌లో న‌టిస్తుండ‌డం విశేషం. యావత్ దేశ‌వ్యాప్తంగా ఎంతో క్యూరియాసిటీ పెంచుతోన్న ఈ సిరీస్ ప్రేక్ష‌కుల‌ను ఏమేర ఆక‌ట్టుకుందో చూడాలి.

Also Read: chiranjeevi acharya: రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతున్న మెగాస్టార్ ‘ఆచార్య ‘ఫస్ట్ సాంగ్

Trivikram and Mahesh : మహేష్ తో మాటల మాంత్రికుడు తెరకెక్కించే సినిమా ఆ సినిమాకు సీక్వెలా..?

Singer Sunitha: దర్శకుడు అలా అనేసరికి చాలా కోపం వచ్చింది.. ఆసక్తికర విషయం చెప్పిన అందాల సింగర్..

Loading...
Unable to load recommendations.
Follow Us