AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha OTT: ఆహాలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్న థాంక్యూ సుబ్బారావు

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలు, సిరీస్ లు , ఆకట్టుకునే టాక్ షోలు, గేమ్ షోలతో ఆడియన్స్ ను మెప్పిస్తుంది ఆహా. ఈ క్రమంలోనే మరో ఆసక్తికర సినిమాను తీసుకురానుంది ఆహా.

Aha OTT: ఆహాలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్న థాంక్యూ సుబ్బారావు
Thankyou Subbarao
Rajeev Rayala
|

Updated on: Jun 16, 2026 | 11:32 AM

Share

‘ఓ.. పిట్టకథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’, ‘రేపు ఉదయం పది గంటలకు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా చెందు ముద్దు సంపాదించుకున్న క్రేజ్, మంచి పేరు గురించి అందరికీ తెలిసిందే. ఆయన దర్శకత్వంలో రానున్న సరికొత్త సినిమా ‘థాంక్యూ సుబ్బారావు. ఈ మూవీని కె రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో కుర్ర పొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మించారు. ఈ సినిమాలో చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటుగా టీజర్‌ను రిలీజ్ చేయగా మంచి హైప్ ఏర్పడింది.

ఇది కూడా చదవండి : ఏంటీ..! ఆ హీరోయిన్ ఈమేనా.!! ఎంత మారిపోయింది.. సంతోషం బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందంటే

కామెడీ, యాక్షన్, లవ్, సస్పెన్స్, థ్రిల్ ఇలా అన్ని అంశాల్ని జోడించి ‘థాంక్యూ సుబ్బారావు’ని తెరకెక్కించారని అర్థం అవుతోంది. హీరో, హీరోయిన్ ట్రాక్ రీఫ్రెషింగ్‌గా అనిపిస్తే.. ట్రైన్‌లో తెలియని ఓ అమ్మాయి.. ఊరు, పేరు, మొహం కూడా తెలియని ఓ అమ్మాయి చుట్టూ తిరిగే ఈ క్రైమ్ స్టోరీని ఉత్కంఠ భరితంగా తెరకెక్కించారని ట్రైలర్ లో తెలుస్తోంది. సస్పెన్స్, థ్రిల్లింగ్, ఫీల్ గుడ్ ఎమోషన్, కామెడీ, లవ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు.

ఇది కూడా చదవండి : గుడి మెట్లమీద స్టార్ హీరో.. బిచ్చగాడు అనికొని రూ.10వేసిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే

ఇలాంటి ఓ డిఫరెంట్ సబ్జెక్ట్, కంటెంట్ మూవీ జూన్ 18 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీత దర్శకుడిగా, పంకజ్ తొట్టాడ కెమెరామెన్‌గా పని చేశారు. డి. వెంకట్ ప్రభు ఎడిటర్‌గా వర్క్ చేశారు. ఆహాలో ఈ ఇంట్రెస్టింగ్ సినిమాను అస్సలు మిస్ నవ్వకండి. థాంక్యూ సుబ్బారావు ఖచ్చితంగా నచ్చుతుందని మూవీ టీమ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్దామనుకున్నా.. అతనే నాకు తిరిగి ప్రాణం పోశారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us