OTT Movie: వామ్మో! మెడికల్ ట్రయల్స్ ఇలా చేస్తారా? ఓటీటీలో ఒళ్లు జలదరించే రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్..

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తున్నంత సేపు ఎంతో ఎంగేజింగ్ గా ఉంటాయి. అందుకే ఈ జానర్ సినిమాలను ఆడియెన్స్ బాగా ఇష్టపడతారు. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కూడా ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది.

OTT Movie: వామ్మో! మెడికల్ ట్రయల్స్ ఇలా చేస్తారా? ఓటీటీలో ఒళ్లు జలదరించే రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్..
OTT Movie

Updated on: Apr 21, 2026 | 10:30 AM

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా తెరకెక్కే సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఈ మధ్యన సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఓ రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ గురించే. ప్రముఖ రచయిత రాజేష్ కుమార్ నవల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. ఆస్పత్రుల్లో మెడికల్ ట్రయల్స్ ఎలా జరుగుతాయి? ఫార్మా మాఫియా ఎలా ఉంటుంది? అన్న అంశాల నేపథ్యంలో ఎంతో థ్రిల్లింగ్ గా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. చెన్నై నగరంలో ఒక భయంకరమైన సంఘటనతో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. ప్రమాదవశాత్తూ ఒక ఐస్ విక్రేత మరణిస్తాడు. అయితే అతను తీసుకెళ్తున్న ఐస్ బాక్స్ లో నరికేసిన మొండి చేతులు ఉంటాయి. దీంతో పోలీసులు ఉలిక్కిపడతారు. దర్యాప్తులో మొదట ఇదొక సాధారణ నేరంగా అనిపిస్తుంది. కానీ కేసు ముందుకు వెళ్లే కొలదీ షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తాయి. ముఖ్యంగా ఒక మెడికల్ మాఫియా ఆగడాల గురించి సంచలన విషయాలు తెలుసుకుంటారు పోలీసులు. అలాగే మానవ అవయవాల రాకెట్ తో, ఈ మొండి చేయికి సంబంధముందని తెలుసుకుంటారు. మరి ఈ మిస్టరీ కేసును పోలీసులు ఎలా ఛేదించారు? చివరికీ ఏమైంది? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

ఊహకు అందని సంఘటనలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు రేగై. ఎం.దినకరన్‌ తెరకెక్కించిన ఈ సిరీస్ లో బాలహాసన్‌, పవిత్ర జనని, బోపాలన్‌ ప్రగదీశ్‌, వినోదిని వైద్యనాథన్‌, శ్రీరామ్‌.ఎం, అంజలిరావ్‌, ఇంద్రజిత్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిరీస్ లో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కోటి 18-29 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతానికి ఈ క్రైమ్ సిరీస్ కేవలం తమిళ్ లో మాత్రమే అందుబాటులో ఉంది. చూడాలనుకుంటే మాత్రం ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ సిరీస్ ను ఎంజాయ్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

జీ5లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us