
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ రాకాస. లేడీ డైరెక్టర్ మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. జీ స్టూడియోస్ సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిహారిక కొణిదెల ఈ సినిమాను నిర్మించింది. ఏప్రిల్ 03న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దీనికి తోడు నిహారికతో పాటు చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేయడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఫాంటసీ హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో రిలీజై దాదాపు మూడు వారాలవుతోంది. ఇప్పటికీ అక్కడక్కడ థియేటర్లలో ఆడుతోంది. అయితే ఈ రాకాస సినిమాను ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే వీరి కోరిక నెరవేరనుంది. రాకాస సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ చేసుకుంది. ఈ మేరకు థియేటర్‌లో రిలీజైన 4 వారాల తర్వాతనే ఓటీటీలో రిలీజ్ చేయాలనే అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం రాకాస మూవీ ఏప్రిల్ చివరి వారంలో లేదా మే రెండో వారంలో ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది.. దీనిపై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కాగా రాకాస సినిమాలో భారీ తారగణమే ఉంది. వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి ఆశిష్ విద్యార్థి, అన్నపూర్ణ, వాసు ఇంటూరి, రోహిణి, అనూప్ సింగ్, రోహన్ రాయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించగా, ఈడురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
More fun. More madness. More reasons to walk into the theatre. 🔥🎬#Rākāsā brings you another glimpse that hits with laughs, energy, and that big-screen vibe. 😎❤️🔥
ఇవి కూడా చదవండిIf you’ve been thinking about it… this is your sign. 🍿
Don’t miss out on the fun’tastic blockbuster of the… pic.twitter.com/6llbuaBuHn
— Pink Elephant Pictures (@PinkElephant_P) April 7, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.