Unstoppable with NBK: బాలయ్యతో సందడి చేయడానికి మాస్ మహారాజ్ రానున్నాడా..?

నట సింహం ,నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండంగా థియేటర్స్ లో గర్జిస్తున్నాడు. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన అఖండ సినిమా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.

Unstoppable with NBK: బాలయ్యతో సందడి చేయడానికి మాస్ మహారాజ్ రానున్నాడా..?
Nbk

Updated on: Dec 18, 2021 | 1:15 PM

Unstoppable with NBK: నటసింహం ,నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండంగా థియేటర్స్ లో గర్జిస్తున్నాడు. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన అఖండ సినిమా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే ఊపులో తన నెక్స్ట్ సినిమాలు చేస్తున్నాడు బాలయ్య. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే హీరోగానే కాకుండా హోస్ట్ గా ను బాలయ్య హడావిడి చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా కోసం బాలయ్య అన్ స్టాపబుల్ అనే టాక్ షో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ షో విజయవంతంగా రన్ అవుతుంది. ఈ షోకు సినిమా ప్రముఖులు గెస్ట్స్ గా హాజరవుతున్నారు.

మొదటి ఎపిసోడ్ కు డైలాగ్ కింగ్ మోహన్ బాబు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత నేచురల్ స్టార్ నాని, బ్రహ్మానందం, అనీల్ రావిపూడి,అఖండ చిత్ర బృందం,హాజరయ్యారు. అలాగే త్వరలో మహేష్ బాబు, రాజమౌళి, కీరవాణి కి సంబంధించిన ఎపిసోడ్స్ ను టెలికాస్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలయ్య షోకు మరో స్టార్ హీరో గెస్ట్ గా రానున్నడని టాక్ వినిపిస్తుంది.  రవితేజతో పాటు దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా హాజరుకానున్నారట. బాలయ్య టాక్ షోకు మాస్ రాజా రవితేజ నెక్స్ట్ గెస్టుగా రానున్నాడని పెద్దెత్తున ప్రచారం జరుగుతుంది. ఇక బాలయ్య , రవితేజ షో మంచి జోష్ గా సాగుతుందని అంటున్నారు అభిమానులు. మరి బాలయ్య షోకు మాస్ రాజా హరాజవుతారా లేదా అన్నదానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Radhe Shyam: ప్రభాస్ సినిమా ప్రీరిలీజ్‌‌కు ముహూర్తం ఖరారు.. ఘనంగా రాధేశ్యామ్ ఈవెంట్..

Bangarraju Movie: వాసివాడి తస్సాదియ్యా.. అంటూ స్టెప్పులేస్తున్న నాగార్జున, నాగచైతన్య..

Nani: ఆ దర్శకుడితో అప్పుడు కుదరలేదు.. ఇప్పుడు వస్తే వదులుకోను.. నాని ఇంట్రస్టింగ్ కామెంట్స్

 

Loading...
Unable to load recommendations.
Follow Us