
ప్రతి వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతుంటాయి. కానీ వాటిలో కొన్ని మంచి సినిమాలు, సిరీస్‌లు మాత్రమే ప్రేక్షకులకు నచ్చి ట్రెండింగ్ జాబితాలోకి చేరతాయి. అలా మీరు కూడా ఓటీటీలో ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ 2 గంటల 3 నిమిషాల సినిమాను మీ మస్ట్ వాచ్ మూవీస్ జాబితాలో చేర్చుకోండి. ఈ మూవీలో రొమాన్స్, హారర్, కామెడీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. పైగా ఇదొక రియల్ క్రైమ్ స్టోరీ. 2021లో కేరళలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఒరిజినల్ తమిళ్ వెర్షన్ అయినప్పటికీ ఓటీటీలో తెలుగు తో పాటు వివిధ భాషల్లోనూ అందుబాటులో ఉంది. ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో గోమతి శంకర్ ప్రధాన పాత్రలో నటించాడు.. మిథున్ దర్శకత్వం వహించారు.
ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ పేరు ‘స్టీఫెన్’. ఈ సినిమా ఒక్కసారి చూడటం మొదలుపెడితే, సినిమా మొత్తం పూర్తయ్యే వరకు మీరు మీ సీటులోంచి లేవలేరు. ఇందులోని మలుపులు, సన్నివేశాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.ఇక ఈ మూవీ క్లైమాక్స్ అయితే ఎవరూ ఊహించలేరు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. స్టీఫెన్ జబరాజ్ (గోమతి శంకర్) అనే కుర్రాడు.. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని ఏకంగా తొమ్మిది మంది అమ్మాయిలని దారుణంగా హత్య చేస్తాడు. తీరా పోలీసులు ఇతడిని పట్టుకుందామని అనుకునేసరికి దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోతాడు. కోర్టుల్లోనూ ఇదే విషయాన్ని ఒప్పుకొంటాడు. దీంతో పోలీసులు విచారణ మొదలు పెడతారు. మరి ఇంతకీ స్టీఫెన్ ఎవరు? అతడి గతమేంటి? తొమ్మిది హత్యలు చేయడానికి కారణమేంటి? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ చిత్రం 2025 డిసెంబర్ 5న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ వంటి వివిధ భాషలలో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో గోమతి శంకర్‌తో పాటు, మైఖేల్ తంగదురై స్మృతి వెంకట్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
A very good attempt at a psychological thriller, with a gripping investigation focused 1st half followed by an uncomfortable 2nd half
Simple and neat !#StephenOnNetflix #Stephen pic.twitter.com/t4MFEBd93e
— 🔁 (@Tutterdotcom) March 17, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి