OTT Movie: బెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ సేతుపతి సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో పాటు కంటెంట్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఐఎమ్ డీబీలో 10కి 9 రేటింగ్ సాధించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

OTT Movie: బెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ సేతుపతి సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie

Updated on: Oct 29, 2026 | 5:57 PM

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఆడియెన్స్ కు వినోదం అందించనున్నాయి. అవరచన్ & బాయ్స్, ఇమ్మోర్టల్, సందీప్ కిషన్ సిగ్మా, ఫహాద్ ఫాజిల్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, హాస్టల్ హద్సా సినిమాలతో పాటు కీర్తి సురేష్ అక్క, రుద్రవనం పీఎస్ వంటి వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం పంచనున్నాయి. అయితే వీటికంటేముందే ఓ బ్లాక్ బస్టర్ సినిమా గురువారం (అక్టోబర్ 29) నుంచే ఓటీటీలోకి వచ్చేసింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ మూవీలో హీరోగా నటించాడు. అక్టోబర్ 01న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. కంటెంట్ పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. సాధారణంగా విజయ్ సేతుపతి సినిమాలన్నీ తెలుగులో రిలీజవుతుంటాయి. అయితే ఈ మూవీ మాత్రం తెలుగులో విడుదల కాలేదు. ఐఎమ్ డీబీలో ఈ సినిమాకు ఇప్పటికీ 10కి రేటింగ్ ఉండడం విశేషం. ఈ సినిమా స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 1986 మద్రాస్ బ్యాక్ డ్రాప్‌లో ఈ బత్తా సినిమా కథ సాగుతుంది. హీరో విజయ్ సేతుపతి ఒక క్రూరమైన గ్యాంగ్‌స్టర్. అతని పేరు చెబితేనే చుట్టుపక్కల అందరికీ వణుకు పుడుతుంది. అయితే అనుకోకుండా ఒకరోజు విజయ్ సేతుపతి ఒక స్కూల్ బాత్రూమ్‌లో లాక్ అయిపోతాడు. ఇతను లోపల ఉండగా బయట నుంచి ఎవరో గడియ పెట్టేస్తారు. మరి తర్వాత ఏమైంది? విజయ్ సేతుపతి బయటకు రాగలిగాడా లేదా? శబరి (సాయి పృథ్వీరాజ్) అనే పిల్లాడికి విజయ్ తో సంబంధమేంటి? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

థియేటర్లలో సంచలన విజయం సాధించి ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన ఈ సినిమా పేరు బత్తా. డైరెక్టర్ బాలాజీ తరణీధరన్ తెరకెక్కించిన ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ అట్లీ సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. విజయ్ సేతుపతికి జోడిగా లిజోమోల్ జోస్ నటించింది. మాస్టర్ సాయి పృథ్విరాజ్ (శబరి), బేబీ సహస్ర శ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళం, తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ బత్తా అందుబాటులో ఉంది. ఇప్పటికే ఎన్నో ప్రశంసలు అందుకున్న ఈ బత్తా సినిమాను మీరు కూడా అసలు మిస్ అవ్వొద్దు.

ఇవి కూడా చదవండి

విజయ్ సేతుపతి బత్తా సినిమా ట్రైలర్..


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us