
ఈ రోజుల్లో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కొత్త కొత్త సినిమాలతో నిండిపోయాయి. మరోవైపు ప్రేక్షకులు సైతం డిఫరెంట్ కంటెంట్ చిత్రాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అటు సస్పెన్స్, థ్రిల్స్‌ల అద్భుతమైన కలయికతో కూడిన ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో కదిలించి, వారి హృదయాలను కలచివేస్తాయి. మీరు మీ కుటుంబంతో కలిసి చూడటానికి ఒక ఆసక్తికరమైన కథ కోసం చూస్తున్నట్లయితే, ఈ చిత్రం మీ మొదటి ఎంపిక అని చెప్పొచ్చు. మనం మాట్లాడుతున్న సినిమా తుడరమ్. ఒక చిన్న కుటుంబం.. అలాగే ఆ ఇంట్లోని పాత అంబాసిడర్ కారు చుట్టూ కథ తిరుగుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Singer Sravana Bhargavi : 10 ఏళ్లు ఎన్నో కష్టాలు చూశాను.. నాపై చాలా ట్రోల్స్ చేశారు.. శ్రావణ భార్గవి ఎమోషనల్.
ఇందులో మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించారు. అలాగే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న హీరోయిన్ శోభన ఈ మూవీలో మోహన్ లాల్ జోడిగా కనిపించారు. ఇందులో పాత అంబాసిడర్ కారును గంజాయి స్మగ్లింగ్ కేసులో అదుపులోకి తీసుకుంటారు పోలీసులు. తన కారును తిరిగి సొంతం చేసుకోవడానికి మోహన్ లాల్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు అనేది సినిమా. ఆ సమయంలో తనకు ఎదురయ్యే సవాళ్లు.. పరిస్థితులు అతడిని ఎలా ఇబ్బందులకు గురి చేశాయి అనేది సినిమా. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో హిందీ, దక్షిణాది భాషలలో అందుబాటులో ఉంది. ఒక సాధారణ వ్యక్తి తన కొడుకు, కుటుంబం కోసం నేరస్థులను ఎలా ఎదుర్కొంటాడో ఈ చిత్రం చూపిస్తుంది. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం, తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠను మీలో రేకెత్తిస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..
ఈ చిత్రంలో బెంజ్ పాత్రలో నటించిన మోహన్‌లాల్, కేవలం నటించడమే కాదు, ఆ పాత్రలో జీవించారు. తక్కువ ఆదాయంతో కుటుంబాన్ని పోషించే అమాయకుడి నుండి, ఆ కుటుంబాన్ని కాపాడటానికి దృఢంగా నిలబడే వ్యక్తిగా మారే క్రమంలో, ఆయన అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్, శోభన, భారతిరాజా, ఇళవరసు వంటి తారలు నటించారు. ప్రతినాయకుడిగా జార్జ్ రూల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా ముగిసిన తర్వాత కూడా అతని పాత్ర ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తుంది. రూ.15 కోట్లతో నిర్మిస్తే రూ.230 కోట్లు రాబట్టింది.
ఎక్కువ మంది చదివినవి : Vadde Naveen: అందుకే సినిమాలు చేయడం లేదు.. అసలు విషయం చెప్పిన హీరో వడ్డే నవీన్..
ఎక్కువ మంది చదివినవి : Trending Song : 30 ఏళ్లుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్.. కుర్రాళ్లు మళ్లీ మళ్లీ పాడుకునే పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..