Megastar Chiranjeevi: సేనాపతిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. రాజేంద్రప్రసాద్ నటనపై ఆసక్తికర కామెంట్స్..

|

Jan 05, 2022 | 1:46 PM

ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాలు మాత్రమే కాకుండా.. థ్రిల్లింగ్ మూవీస్ అందిస్తోంది

Megastar Chiranjeevi: సేనాపతిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు.. రాజేంద్రప్రసాద్ నటనపై ఆసక్తికర కామెంట్స్..
Senaapthi Megastar
Follow us on

ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాలు మాత్రమే కాకుండా.. థ్రిల్లింగ్ మూవీస్ అందిస్తోంది ఓటీటీ సంస్థ ఆహా. కేవలం తెలుగు చిత్రాలు మాత్రమే కాకుండా.. ఇతర భాష సినిమాలను డబ్ చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. ఇటీవల మరో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో సేనాపతి చిత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. నటకిరీటి రాజేంద్రప్రసాద్ నటించిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో రాజేంద్రప్రసాద్ ఓటీటీలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రానికి పవన్ సాధినేని దర్శకత్వం వహించగా.. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా పై అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించాడు.

తాను సేనాపతి సినిమా చూశానని.. అనుక్షణం ఏం జరుగుతుందోననే ఉత్కంఠభరితంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని చిరంజీవి అన్నారు. మంచి అభిరుచికి అద్దం పట్టే సినిమాను నిర్మించినందుకు నిర్మాతలు సుష్మిత కొణిదెల, విష్ణులకు అభినందనలు తెలియజేశారు. అలాగే నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో వినూత్న పాత్రలో అద్భుతంగా నటించారని.. ఆయన నటన ప్రతిభకు ఈ సినిమా ఓ మచ్చుతునక అంటూ ప్రశంసలు కురిపించారు. అలాగే సేనాపతి చిత్రాన్ని నిర్మించిన గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ టీంకు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కాకుండా.. న‌రేష్ అగ‌స్త్య, జ్ఞానేశ్వర్ కందేర్గుల‌, హ‌ర్షవ‌ర్దన్‌, రాకేందు మౌళి త‌దిత‌రులు కీలక పాత్రలలో నటించారు.

ట్వీట్..

Also Read: Perni Nani vs RGV: వర్మ ప్రశ్నలకు పేర్ని నాని కౌంటర్ ఎటాక్.. ఏ చట్టం చెప్పిందంటూ..

Anupama Parameswaran: లవ్ బ్రేకప్ గురించి హీరోయిన్ ఓపెన్ కామెంట్స్.. కానీ.. ప్రేమను గుర్తుచేసుకోనంటూ..

 Bellamkonda Sreenivas : స్పీడ్ పెంచిన బెల్లం కొండ హీరో.. ఛత్రపతి హిందీ రీమేక్ టాకీ పార్ట్ పూర్తి

RGV On AP Govt. సినిమా టికెట్స్ వ్యవహారం.. ఏపీ ప్రభుత్వానికి పది ప్రశ్నలను సంధించిన రామ్ గోపాల్ వర్మ ..