OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఆ రెండు మూవీస్ చాలా స్పెషల్

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు కూడా ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దాం రండి.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అద్దిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఆ రెండు మూవీస్ చాలా స్పెషల్
OTT Movies

Updated on: Mar 30, 2026 | 3:55 PM

ఈ వారం సినిమా ప్రియులను అలరించేందుకు బోలెడు కొత్త సినిమాలు రెడీ అయిపోయాయి. థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ కొత్త సినిమాల సందడి ఉండనుంది. ఈ శుక్రవారం శర్వానంద్‌ బైకర్, సంగీత్ శోభన్ రాకాస వంటి తెలుగు సినిమాలతో పాటు సముద్రఖని కార్మేని సెల్వం, లెజెండ్‌ శరవణన్‌ హీరోగా వస్తోన్న లీడర్ వంటి డబ్బింగ్ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇక ఓటీటీల విషయానికి వస్తే.. తెలుగులో సుహాస్ మూవీ హే బల్వంంత్, శ్రీ విష్ణు థ్రిల్లర్ మృత్యుంజయ్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైపోయాయి. అలాగే శివాజీ, లయ నటించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కూడా ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది . వీటితో పాటు బాలీవుడ్ నుంచి సితారే జమీన్ పర్, హ్యాపీ పటేల్, వధ్‌-2 లాంటి ఆసక్తికర సినిమాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్‌ సినిమాలు, హాలీవుడ్‌ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లోకి రానున్నాయి. ఓవరాల్‌గా చూస్తే దాదాపు 16కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఏయే సినిమా ఏయే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో ఓ లుక్కేద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్..

  • రిపుల్(హాలీవుడ్ వెబ్ సిరీస్)- మార్చి 31
  • హ్యాపీ పటేల్(హిందీ సినిమా)- ఏప్రిల్ 01
  • జో కిట్టీ- సీజన్-3(హాలీవుడ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 02
  • మృత్యుంజయ్(తెలుగు సినిమా)-ఏప్రిల్ 03
  • మామ్లా లీగల్‌ హై- సీజన్-2(బాలీవుడ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03
  • వధ్‌-2(హిందీ సినిమా)-ఏప్రిల్ 03
  • బ్లడ్‌హౌండ్స్ సీజన్-2(హాలీవుడ్ వెబ్ సిరీస్)-ఏప్రిల్ 03
  • హై టైడ్స్- సీజన్-2(హాలీవుడ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03

అమెజాన్ ప్రైమ్..

  • మా కా సమ్- సీజన్-1(హిందీ సిరీస్)- ఏప్రిల్ 04
  • సెండ్ హెల్ప్- ఇంగ్లిష్ సినిమా- మార్చి 31
  • అవతార్ ఫైర్ అండ్ యాష్- మార్చి 31

జియో హాట్‌స్టార్‌..

  • సెండ్ హెల్ప్‌(హాలీవుడ్ హారర్‌ మూవీ)- మార్చి 31
  • ఫైవ్ నైట్స్ ఏట్ ఫ్రెడ్డీస్‌-2(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 03

జీ5 ఓటీటీలో..

  • హే బల్వంత్‌(తెలుగు సినిమా)- మార్చి 31
  • బాబ్జీ ఘర్‌ పర్‌ హై-ఫన్ ఆన్ ది రన్(హిందీ మూవీ)- ఏప్రిల్ 03
  • తానా -ఏప్రిల్ 3

ఈటీవీ విన్

  • ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’- -ఏప్రిల్ 3

ఆపీల్ టీవీ ప్లస్..

  • యువర్ ఫ్రెండ్స్ అండ్ నెబర్స్(హాలీవుడ్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03

సన్‌ నెక్ట్స్..

  • వడం(తమిళ సినిమా)- ఏప్రిల్ 03

సోనీ లివ్

  • సితారే జమీన్ పర్(బాలీవుజ్ )-ఏప్రిల్ 03

Note: ఇవి కాక వారం  కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us