
హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటోన్న కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి రూపొందించిన మొదటి సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. వి. మునిరాజ్ తెరకెక్కించిన ఈ రూరల్ కామెడీ ఎంటర్ టైనర్ లో కొత్త నటులు సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఏప్రిల్ 17న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. పల్లెటూరిలాగే ఆహ్లాదకరంగా సాగే కథా కథనాలు తెలుగు ఆడియెన్స్ ను బాగానే మెప్పించాయి. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టింది. థియేటర్లలో ఆడియెన్స్ ప్రశంసలు అందుకున్న ఈ తిమ్మరాజుపల్లి ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మే 15 నుంచి తిమ్మరాజుపల్లి సినిమాను స్ట్రీమింగ్ ను చేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితమే అధికారిక ప్రకటన కూడా చేసింది. అలాగే ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్లకు 24 గంటల ముందే ఈ సినిమా అందుబాటులోకి తీసుకురానున్నట్లు కూడా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్లకు గురువారం అర్ధరాత్రి నుంచే తిమ్మరాజుపల్లి సినిమా అందుబాటులోకి వచ్చింది. అయితే రేపటి (మే 15) నుంచి రెగ్యులర్ సబ్ స్క్రైబర్లకు కూడా ఈ మూవీ అందుబాటులోకి రానుంది.
కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ బ్యానర్లపై కిరణ్ అబ్బవరం, తేజ వేల్పుచర్ల సంయుక్తంగా తిమ్మరాజుపల్లి టీవీ సినిమాను నిర్మించారు. స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ, లతీష్, బాలరాజు, సాయికృష్ణ, అనిల్, తేజ విహాన్, టీవీ రామన్, చిట్టిబాబు, ప్రతాప్ రెడ్డి, మాధవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వంశీకాంత్ రేఖన సంగీతం సమకూర్చారు. 1996 సమయంలోని రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుంది. ఆ ఊర్లో రాజప్ప (ప్రదీప్ కొట్టె)కు మాత్రమే టీవీ ఉంటుంది. అయితే అది దొంగతనానికి గురవుతుంది. మరి ఊర్లో ఉండే ఒకే ఒక్క టీవీని ఎవరు దొంగతనం చేశారు? హీరో, హీరోయిన్ల ప్రేమకథ ఏమైంది? అన్నదే ఈ సినిమా కథ.
A story that takes you straight back to the 90s
Watch #ThimmarajupalliTV now on aha@KA_Productions_ @SumairaStudios @ahavideoIN
Streaming for #ahaGold users #ThimmarajupalliTV #KAProductions pic.twitter.com/oi0jgcjmAX— ka productions (@KA_Productions_) May 14, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.