OTT Movie: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి సీఎం విజయ్ కుమారుడి థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ వివరాలివే

తమిళనాడు ముఖ్యమంత్రి వి దళపతి విజయ్ కుమారుడు జేసన్ విజయ్ దర్శకుడిగా పరిచయమైన సినిమా 'సిగ్మా'. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ స్టార్ సందీప్ కిషన్ హీరోగా నటించాడు. జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించింది.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి సీఎం విజయ్ కుమారుడి థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ వివరాలివే
Sigma Movie

Updated on: Oct 27, 2026 | 5:49 PM

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ సినిమా ‘సిగ్మా’. తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ కుమారుడు జేసన్ విజయ్ మొదటి సారి మెగా ఫోన్ పట్టి ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాడు. తెలుగమ్మాయి ఫరియా అబ్దుల్లా ఈ మూవీలో హీరోయిన్ గా చేసింది. రాజు సుందరం, సంపత్‌ రాజ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సీఎం విజయ్ కుమారుడు సినిమా కావడంతో రిలీజ్ కు ముందు సిగ్మాపై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్స్, గ్లింప్స్, ట్రైలర్ కూడా ఆకట్టుకున్నాయి. దీనికి తోడు హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 02 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిగ్మా అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. మొదటి షో నుంచే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమా పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. డైరెక్టర్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన జేసన్ విజయ్ కు సిగ్మా సినిమా తీవ్ర నిరాశనే మిగిల్చింది. థియేటర్లలో పెద్దగా ఆడని సిగ్మా సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది.

సిగ్మా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం (అక్టోబర్ 30) నుంచి సిగ్మా సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగు, తమిళంతో పాటు ఇతర ప్రధాన భాషల్లోనూ సిగ్మా సినిమా అందుబాటులోకి రానుంది. సిగ్మా సినిమా విషయానికి వస్తే.. ప్రతిష్ఠాత్మక లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ ఈ సినిమాను నిర్మించారు. తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ లిమిటెడ్, ఎన్‌.వి.ఆర్‌ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను విడుదల చేశాయి. శివ్ పండిట్, అన్బూ థాసన్, షీలా రాజ్ కుమార్, కిరణ్ కొండా తదితరులు ఈ మూవీలో వివిధ పాత్రలు పోషించారు. టాలీవుడ్ హీరోయిన్ క్యాథరిన్ థెరీసా ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేయడం విశేషం. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మరి థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని సిగ్మా సినిమా ఓటీటీలోనైనా మెప్పిస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో సిగ్మా సినిమా..

 

 

సిగ్మా సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us