సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌లో అదరగొట్టిన జొర్దర్ సుజాత.. ఆమె పాత్రను మిస్ చేసుకున్న జబర్దస్త్ బ్యూటీ ఎవరో తెలుసా..

ఇప్పటికే క్రేజీ వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో అదరగొడుతున్నాయి. ఇక ఇటీవల ఆకట్టుకుంటున్న వెబ్ సిరీస్ లో సేవ్ ది టైగర్ వెబ్ సిరీస్ ఒకటి. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ వెబ్ వెబ్ సిరీస్ ఇప్పటికే సీజన్ వన్ పుతి చేసుకుంది. ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమఠం, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని శర్మ, యూట్యూబర్ గంగవ్వ, జబర్దస్త్ రోహిణిలు ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించారు.

సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌లో అదరగొట్టిన జొర్దర్ సుజాత.. ఆమె పాత్రను మిస్ చేసుకున్న జబర్దస్త్ బ్యూటీ ఎవరో తెలుసా..
Save The Tigers

Updated on: Mar 20, 2024 | 10:43 AM

ఇటీవల సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీల పుణ్యమా అని వెబ్ సిరీస్ లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇప్పటికే క్రేజీ వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో అదరగొడుతున్నాయి. ఇక ఇటీవల ఆకట్టుకుంటున్న వెబ్ సిరీస్ లో సేవ్ ది టైగర్ వెబ్ సిరీస్ ఒకటి. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ వెబ్ వెబ్ సిరీస్ ఇప్పటికే సీజన్ వన్ పుతి చేసుకుంది. ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమఠం, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని శర్మ, యూట్యూబర్ గంగవ్వ, జబర్దస్త్ రోహిణిలు ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించారు. ఈ వెబ్ సిరీస్ మొగుడు పెళ్లలా మధ్య జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు.

అయితే ఈ వెబ్ సిరీస్ లో ప్రియా దర్శి, జోర్దార్ సుజాత జంట ప్రేక్షకులను మెప్పించింది. ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే జోర్దార్ సుజాత నటించిన పాత్ర కోసం ముందుగా మరో నటిని అనుకున్నారట. సేవ్ ది టైగర్ సిరీస్ లో జోర్దార్ సుజాత పాత్ర చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అయితే ఆ పాత్రను మిస్ చేసుకున్న నటి ఎవరో కాదు జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న రోహిణి.

సీరియల్స్ లో నటించిన రోహిణి ఆతర్వాత జబర్దస్త్ కామెడీ షోలో స్కిట్స్ తో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే సేవ్ ది టైగర్ సిరీస్ లో ప్రియదర్శి భార్య పాత్ర వచ్చినప్పుడు ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో నో చెప్పిందట. దాంతో ఆ పాత్ర సుజాతకు వెళ్ళింది. ఆతర్వాత ఇదే సిరీస్ లో పనిమనిషి పాత్ర కోసం రోహిణిని అడగ్గా ఓకే చేసిందట. ఈ వెబ్ సిరీస్ లో రోహిణి పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతుంది. సేవ్ ది టైగర్ సీజన్ 2 మంచి వ్యూస్ సొంతం చేసుకుంటుంది.

రోషిణి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ ..

ప్రియదర్శి ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.